• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్లాస్‌మేట్స్‌ను అది....చేద్దామా...? విద్యార్థుల షాకింగ్ వాట్సప్ చాట్...8మంది విద్యార్థుల సస్పెషన్

|

స్కూల్ స్థాయిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహాంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి తోడ్పడాలి. కాని ప్రస్తుత సమాజ పోకడలు, ఆదునిక అలవాట్లు, సాంకేతిక విప్లవం వెరసి విద్యార్థుల మనసులను కలుషితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చదువుకోవాల్సిన విద్యార్థుల నోటా సెక్స్, హింస, అత్యాచారం లాంటీ పదాలు వెలువడుతున్నాయి. తాజాగా ఇలాంటీ ధోరణి ఓ ఇంటర్‌నేషన్ బోర్డింగ్ స్కూల్ విద్యార్థుల్లో బయటపడింది.

స్కూల్ విద్యార్థుల వాట్సప్ గ్రూపు

స్కూల్ విద్యార్థుల వాట్సప్ గ్రూపు

ముంబయిలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో చదువుకునే కొంతమంది విద్యార్థులు కలిసి వాట్సప్‌లో జరిపిన సంబాషణ సంచలనం రేకెత్తిస్తోంది. స్కూల్లోని 23 మంది విద్యార్థులు గ్రూపుగా ఏర్పడి తోటి విద్యార్థినిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ...అప్పుడే రేప్‌లు అత్యాచారాలు అంటూ చాటింగ్ కొనసాగించారు. అయితే గ్రూపులోని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని పసిగట్టి స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో గ్రూపులోని ఎనిమిది విద్యార్థులను స్కూలు యజమాన్యం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

13 ఏళ్లకే సెక్స్ ఆలోచనలు...

13 ఏళ్లకే సెక్స్ ఆలోచనలు...

ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఉండి ఇంటర్‌నేషనల్ బోర్డు విద్యను కొనసాగిస్తున్న ఓ స్కూళ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. 13, 14 సంవత్సరాల వయస్సున్న విద్యార్థులు మొత్తం 23 మంది ఒక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ గ్రూపులో కొందరి విద్యార్థుల చాటింగ్ చూస్తే.. అంత్యంత అందోళనకరంగా ఉంది. అందులో వారు రేప్ మరియు హింస గురించి చర్చించుకున్నారు. అత్యంత దారుణంగా ఓ విద్యార్థిని గురించి కూడ చాటింగ్ జరిగింది. తొటి విద్యార్థిని రేప్ చేస్తానని ఒకరు, వద్దంటూ మరొకరు చాటీంగ్ చేశారు. వారిని వారిని ఉద్దేశించి గ్యాంగ్ బ్యాంగ్ అనే పదాలను వాడారు. విద్యార్థినిలందరిపై ఒకరకమైన పదజాలాన్ని గే, హోమో సెక్స్, గ్యాంగ్ రేప్ వంటి పదాలతోపాటు దారుణంగా అత్యాచారం చేయడం అనే అర్థంలో చాటింగ్ కొనసాగింది.

ఎనిమిది మంది విద్యార్థుల సస్పెండ్

ఎనిమిది మంది విద్యార్థుల సస్పెండ్

అయితే ఈ చాటింగ్‌ జరిగిన గ్రూపులోని ఓ విద్యార్థి ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో చాటింగ్ చదివి అవాక్కయిన తల్లిదండ్రులు వెంటనే సంబంధిత స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన స్కూల్ యజమాన్యం గ్రూపులోని ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. అయితే ఈ సంఘటన అంతా.. అంతర్గతంగానే కొనసాగినా... మీడియా ద్వార బయటకు రావడంతో సంచలనంగా మారింది. దీంతో ఆ స్కూలుకు వెళ్లడానికి విద్యార్థినిలు బయపడుతున్నట్టు కూడ పేర్కొన్నారు. అయితే ఈ అంశాలపై ఎక్కడా ఫిర్యాదు చేయడం లేదని స్కూల్ యాజమాన్యమే దీన్ని పరిష్కరిస్తుందని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు చెబుతున్నారు.

 చట్టాల్లో కాదు పిల్లల్లో మార్పులు

చట్టాల్లో కాదు పిల్లల్లో మార్పులు

దిశ సంఘటన తర్వాత ...మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, హత్యలు నిరోధించాలంటే ఏం చేయాలి... కఠిన చట్టాలు తీసుకురావాలా... సత్వర న్యాయం జరగాలా...నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలా... లేదంటే... మగపిల్లల్లో మార్పులు తీసుకురావాలా... అనే చర్చ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది..అయితే ఎన్ని కఠిన చట్టాలను తీసుకువచ్చినా... మహిళలపై అత్యాచారాలు ఆపలేకపోతున్నారు. దీంతో మగపిల్లలకే సరైన సమాజ విలువలు నేర్పడంతో పాటు వారిని కూడ ఆడపిల్లలను పెంచినట్టు పెంచాలనే అలోచనలు పలువురు బయటపెడుతున్నారు. అప్పుడే అడమగ తేడా లేకుండా సమాజం ముందుకు సాగే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

English summary
Schoolboys at Mumbai school talk about raping classmates, 'gang bang' in horrific WhatsApp chats, then Eight Mumbai students have been suspended from school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X