వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక స్కూల్ కు వెళ్ళేది వంద రోజులే ... విద్యా ప్రణాళికలో సమూల మార్పులు చేసిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటంలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే లాక్ డౌన్ నుండి పలు రంగాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థుల స్కూల్స్ , కాలేజీల విషయంలో ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఇక మరో పక్క కేంద్రం విద్యా ప్రణాళిక మార్చటానికి కసరత్తు చేసింది . నూతన విద్యా సంవత్సరంలో అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం నేపధ్యంలో అనుసరించిన విద్యా ప్రణాళికపై అధ్యయనం చేసింది .

corona update : ప్రపంచంలో 9వ స్థానానికి భారత్ .. ఇండియాలో తాజా పరిస్థితి ఇది !!corona update : ప్రపంచంలో 9వ స్థానానికి భారత్ .. ఇండియాలో తాజా పరిస్థితి ఇది !!

విద్యార్థుల అకడమిక్ క్యాలెండర్ ను మార్చేసిన కరోనా

విద్యార్థుల అకడమిక్ క్యాలెండర్ ను మార్చేసిన కరోనా

కరోనా వైరస్ .. దాని ప్రభావంతో విధించిన లాక్ డౌన్ విద్యార్థుల అకడమిక్ క్యాలెండర్ ను పూర్తిగా మార్చేసింది . దీనితో గతంలోలా విద్యార్థులు స్కూల్స్ కు 220 రోజులు వెళ్ళకపోవచ్చునని విద్యావేత్తలు అంటున్నారు. ఇక విద్యార్థులు స్కూల్స్ కు 100 రోజులు వెళ్లే అవకాశాలు ఉంటాయని మరో 100 రోజులు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని ఆ విధంగా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.

డిజిటల్ విద్యావిధానంలో 100 రోజులే స్కూల్స్

డిజిటల్ విద్యావిధానంలో 100 రోజులే స్కూల్స్

మరో 20 రోజుల పాటు విద్యార్ధులలో మానసిక వికాసాన్ని పెంచేలా డాక్టర్లు, కౌన్సిలర్స్‌తో కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం . లాక్ డౌన్ సడలించి స్కూళ్ళు, కాలేజీలు కొనసాగించటానికి కూడా ఒక విధానం అనుసరించాలని భావిస్తున్న నేపధ్యంలోనే దీనిపై కసరత్తు చేస్తుంది కేంద్ర సర్కార్ . డిజిటల్ విద్యా విధానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న సర్కార్ రెగ్యులర్ గా కాకుండా ఆల్టర్నేట్ డేస్ లో స్కూల్స్ నిర్వహించి స్కూల్ లేని రోజుల్లో డిజిటల్ ద్వారా బోధన సాగించే విషయంలో చాలా సీరియస్ గా ఉంది.

ఆన్లైన్ సౌకర్యం లేని విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న హెచ్ఆర్డీ

ఆన్లైన్ సౌకర్యం లేని విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న హెచ్ఆర్డీ

ఆన్లైన్ సౌకర్యం లేని విద్యార్ధులపై స్కూల్ యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచించింది . ఇక మూడు రోజుల పాటు స్కూల్స్ ఉండే అవకాశం ఉంది . మిగతా మూడు రోజులు ఇంట్లోనే ఆన్ లైన్ లో పాఠాలు నేర్చుకోవాలి . ఇక 12 బోధనా చానళ్ళను ఏర్పాటు చేస్తున్నారు . ఇక దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే ఇవ్వనున్నారు .

English summary
The lockdown imposed under Corona virus influence has completely altered students' academic calendar. With this, students may not go to school for 220 days. The central government is planning to make it possible for students to have 100 days to go to school and another 100 days to study at home from digital classes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X