వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్స్ రీఓపెన్... మొదట 10,12 విద్యార్థులకు... కేంద్రం ప్రణాళికలో కీలకాంశాలు ఇవే..!!

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కారణంగా దాదాపు 5 నెలలుగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశలవారీగా విద్యా సంస్థలను రీఓపెన్ చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయనుంది. రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొననున్నారు.

అగస్టు 31 తర్వాత....

అగస్టు 31 తర్వాత....

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలోని కోవిడ్ -19 మేనేజ్‌మెంట్ మంత్రుల బృందానికి అనుబంధంగా ఉన్న కార్యదర్శుల బృందం ఈ ప్రణాళికపై చర్చించింది. ఆగస్టు 31 తర్వాత మిగిలిన కార్యకలాపాలను కూడా అన్‌లాక్ చేసేందుకు ఫైనల్ అన్‌లాక్ మార్గదర్శకాల్లో ఈ నిర్ణయాలను పొందుపరుస్తారని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల రీత్యా క్లాసులు ఎప్పుడు ప్రారంభించాలి... విద్యార్థులను ఎప్పుడు క్లాసులకు పిలవాలి... అన్న దాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలిపెట్టనుంది.

సుముఖంగా లేని తల్లిదండ్రులు...

సుముఖంగా లేని తల్లిదండ్రులు...

పాఠశాలల రీఓపెనింగ్‌కి సంబంధించి కేంద్రం జరిపిన చర్చల్లో పాల్గొన్న ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ...'తక్కువ కరోనా కేసులు నమోదైన ఓ రాష్ట్రం... సీనియర్ క్లాస్ విద్యార్థులను తిరిగి తరగతులకు రప్పించేందుకు ఆసక్తి కనబరుస్తోంది.' అని చెప్పారు.అయితే కేంద్రం విద్యా సంస్థలను రీఓపెన్ చేయాలని భావిస్తున్నప్పటికీ... చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సిద్దంగా లేరు. జూలై నెలలో పాఠశాల విద్యా శాఖ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తిరిగి తెరిస్తే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు చాలా ఇబ్బందులకు గురవుతాయని కేంద్రానికి తెలిపాయి.

ఇలా క్లాసుల నిర్వహణ...

ఇలా క్లాసుల నిర్వహణ...

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలు పాఠశాలలను రీఓపెన్ చేసి దశలవారీగా నిర్వహించాలని ప్రతిపాదించాయి. దాని ప్రకారం మొదటి 15 రోజులు 10,12 తరగతుల విద్యార్థులను స్కూల్‌కు రావాల్సిందిగా చెప్తారు. ఇందులో వేర్వేరు సెక్షన్ల విద్యార్థులకు ప్రత్యేక తేదీలు నిర్ణయించి... ఆరోజుల్లో మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. ఉదాహరణకు,ఒక స్కూల్లో పదో తరగతిలో 4 సెక్షన్లు ఉంటే... మొదట రెండు సెక్షన్ల విద్యార్థులకు ప్రత్యేక తేదీలు నిర్ణయించి క్లాసులు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగతా రెండు సెక్షన్లకు కూడా క్లాసులు నిర్వహిస్తారు.

స్కూల్ పని వేళలు కుదింపు...

స్కూల్ పని వేళలు కుదింపు...


అన్ని స్కూళ్లలోనూ పని గంటలను కుదిస్తారు. కేవలం రెండు నుంచి మూడు గంటలు మాత్రమే స్కూల్లో విద్యార్థులు ఉండేలా క్లాసులను ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అన్ని స్కూళ్లు షిఫ్టుల పద్దతిని అనుసరించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఉదయం 8గం. నుంచి 11గం. వరకు,మధ్యాహ్నం 12గం. నుంచి 3గం. వరకు క్లాసులను నిర్వహించాలి. రెండంటి మధ్య గంట బ్రేక్ సమయం ఉండగా... ఆ సమయంలో క్లాసులను శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. స్కూళ్లలో 33శాతం విద్యార్థులు,టీచర్ల నిష్పత్తిని పాటించాలి.

ప్రైమరీ,ప్రీ ప్రైమరీ రీఓపెన్ ఇప్పట్లో లేనట్లే....

ప్రైమరీ,ప్రీ ప్రైమరీ రీఓపెన్ ఇప్పట్లో లేనట్లే....

స్కూళ్లను ఓపెన్ చేసేందుకు కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం ప్రైమరీ,ప్రీప్రైమరీ విద్యార్థులను మాత్రం ఇప్పట్లో స్కూళ్లకు పిలిచేలా లేదు. మరికొన్నాళ్ల పాటు వారికి ఆన్‌లైన్ క్లాసులే కొనసాగనున్నాయి. మొదట 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాస్ రూమ్ పాఠాలను మొదలుపెట్టి... ఆ తర్వాత ఆరు నుంచి 9వ తరగతి విద్యార్థులకు కూడా పరిమిత సమయంతో క్లాసులు నిర్వహించేలా మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. స్విట్టర్లాండ్ లాంటి దేశంలో విద్యార్థులను తిరిగి ఎలా క్లాస్ రూమ్స్‌కి రప్పించారో తాము అధ్యయనం చేశామని... అదే పద్దతిని ఇక్కడ కూడా అమలుచేయాలనుకుంటున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

English summary
The Centre has framed a plan to re-open schools and other educational institutions in a phase-wise manner between September 1 and November 14.The modalities of the plan have been discussed by the group of secretaries attached to the Group of Ministers on Covid-19 management, headed by health minister Harsh Vardhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X