వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారంలో మూడు రోజులే స్కూల్స్ ? విద్యా విధానంలో పెను మార్పుల దిశగా కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటంలో భాగంగా ఇండియాలో మార్చి 22 వ తేదీ నుంచి స్కూల్స్ అన్నీ బంద్ అయ్యాయి. పిల్లలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని కార్పోరేట్ స్కూల్స్ మాత్రం ఆన్ లైన్ విద్యా బోధన చేస్తూ తరగతులు నిర్వహిస్తున్నాయి. స్కూల్ విద్యార్థులకు మాత్రమే కాకుండా ఇప్పటికే ఆయా కాలేజీలు సైతం ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. లాక్ డౌన్ ఉండటంతో ఒకటి నుంచి 12 వ తరగతి విద్యార్థుల వరకు లాక్ డౌన్ సడలించి తరగతులు నిర్వహించాలంటే ఎలా అన్న విషయంలో కేంద్రం తర్జనలు భర్జనలు చేస్తుంది .

టీచర్లకు ఆన్ లైన్ క్లాసుల తిప్పలు .. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులుటీచర్లకు ఆన్ లైన్ క్లాసుల తిప్పలు .. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులు

డిజిటల్ విద్యా విధానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న కేంద్ర సర్కార్

డిజిటల్ విద్యా విధానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న కేంద్ర సర్కార్

లాక్ డౌన్ సడలించి స్కూళ్ళు, కాలేజీలు కొనసాగించటానికి కూడా ఒక విధానం అనుసరించాలని భావిస్తుంది కేంద్ర సర్కార్ . ఇక ఇందులో భాగంగా డిజిటల్ విద్యా విధానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కేంద్ర సర్కార్ . రెగ్యులర్ గా కాకుండా ఆల్టర్నేట్ డేస్ లో స్కూల్స్ నిర్వహించి స్కూల్ లేని రోజుల్లో డిజిటల్ ద్వారా బోధన సాగించే అంశం పరిశీలిస్తుంది .ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం తగ్గించటం లో భాగంగా సరి బేసి విధానం అమలు చేస్తున్నారు . ఇక ఈ క్రమంలో అలాంటి విధానాన్ని స్కూల్స్ విషయంలో అమలు చేసి 50శాతం విద్యార్థులు ఒకరోజు, మరో 50శాతం విద్యార్థులు మరొక రోజు స్కూల్స్ కు హాజరయ్యేలా చూడాలనే ఆలోచన చేస్తున్నారు .

 మూడు రోజులే స్కూల్స్ .. మూడు రోజులు ఇంట్లోనే డిజిటల్ క్లాసులు

మూడు రోజులే స్కూల్స్ .. మూడు రోజులు ఇంట్లోనే డిజిటల్ క్లాసులు

మూడు రోజులు మాత్రమే విద్యార్థులు స్కూల్స్ కు వెళ్ళేలా చేసి మిగతా మూడు రోజులు టీవీ ఛానల్స్ ద్వారా పాఠాలను వినాల్సి ఉంటుంది. ఇక అంతేకాదు కేంద్రం కేవలం విద్యార్థులు కోసం 12 ఛానల్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. డిజిటల్ ఛానల్స్ ద్వారా మూడు రోజులపాటు స్కూల్ పాఠాలు చెప్పనున్నారు. స్కూల్ ద్వారా మరో మూడు రోజులపాటు పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తున్నది కేంద్రం. ఈ విధానం సక్సెస్ అయితే డిజిటల్ విద్యావ్యవస్థలో పెను మార్పులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

Recommended Video

Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied
 విద్యా విధానంలో సమూల మార్పులకు కారణం అవుతున్న కరోనా లాక్ డౌన్

విద్యా విధానంలో సమూల మార్పులకు కారణం అవుతున్న కరోనా లాక్ డౌన్

ఇక ఇప్పటికే కరోనా లాక్ డౌన్ ప్రభావం స్కూల్స్ కు వెళ్ళే విద్యార్థులు మీద చాలా దారుణంగా పడింది. స్కూల్స్ కు ఎక్కువ కాలం సెలవులు ఇవ్వడం వలన పిల్లలు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి . ఇక స్కూల్స్ విషయంపై మానవ వనరుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్కూల్స్ ను మూడు రోజుల పాటే సామాజిక దూరం పాటిస్తూ , మాస్కులు ధరిస్తూ నిర్వహించాలని భావిస్తోంది. ఇక మూడు రోజుల పాటు డిజిటల్ విద్యా విధానం అలవాటు చెయ్యాలని సర్కార్ యోచిస్తుంది . దీనికోసం త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతున్నది.

English summary
Central government, which hopes to ease the lock-down and also pursue a policy of schools and colleges, focuses heavily on digital education. Unlike regular, alternate days, schools are conducting digital teaching in non-school days .There is already an odd policy for reducing pollution in Delhi. Fifty per cent of students expected to attend one day and another 50 per cent expected to return to school the other day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X