వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో మళ్లీ మోగనున్న బడి గంటలు... తరగతుల నిర్వహణకు మార్గదర్శకాలివే...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
స్కూళ్లు, విద్య, కరోనావైరస్

తెలంగాణలో బడులు, విద్యాసంస్థలు తెరుచుకోవడానికి రంగం సిద్ధమైంది. తొమ్మిది, ఆపై తరగతుల వారికి ఫిబ్రవరి 1 నుంచి క్లాసులు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

దీంతో తొమ్మిది నుంచి డిగ్రీ వరకూ అన్ని విద్యా సంస్థలూ మొదలుకాబోతున్నాయి. కానీ, తొమ్మిదో తరగతి లోపువారికి క్లాసులు ఎప్పుడు మొదలవుతాయన్న విషయంపై స్పష్టత లేదు.

గత అక్టోబరు మధ్య నుంచే బడులు, కాలేజీలు తెరిచే అవకాశం కల్పించింది కేంద్రం. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతి పాటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో గత నవంబరులో బడులు తెరిచారు. తెలంగాణలో మాత్రం ఫిబ్రవరి 1 నుంచి తెరవాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకూ తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు టీశాట్, దూరదర్శన్‌ల ద్వారా పాఠాలు ప్రసారమవుతూ ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు ప్రైవేటు యాప్స్ ద్వారా పాఠాలు చెబుతున్నాయి.

స్కూళ్లు, విద్య, కరోనావైరస్

ఇక తాజా ఉత్తర్వులు ప్రైవేటు, ప్రభుత్వ రెండు స్కూళ్లకూ వర్తిస్తాయి. అంటే ఫిబ్రవరి ఒకటిన ప్రైవేటు, ప్రభుత్వ రెండు బడులూ తెరుస్తారు.

దీనిపై 18వ తేదీన గురుకుల పాఠశాలలు నిర్వహిస్తోన్న శాఖలతోనూ, 19న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతోనూ సమావేశం నిర్వహిస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై 20వ తేదీకి తుది నిర్ణయాలు వస్తాయి. 25వ తేదీకి బడులు సిద్ధం అవుతాయి.

స్కూళ్లలో పాటించాల్సిన విధివిధానాలతో కూడిన 11 పేజీల మార్గదర్శకాలను విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ విడుదల చేశారు.

దీని ప్రకారం ప్రతి పాఠశాలా ఒక ప్రణాళిక రూపొందించాలి. అందులో అకాడమిక్, మెడికల్, లాజిస్టిక్, శానిటైజేషన్ ప్లాన్ ఉండాలి. అంతేకాదు, ఈ స్కూళ్లు తెరవడంపై ప్రతి జిల్లాలోనూ ఓ కమిటీ వేస్తారు. కలెక్టర్, ఐటీడీఏ, పీవో, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, మునిసిపల్ కమిషనర్, పంచాయితీ ఆఫీసర్, ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డీఈవో, ప్రిన్సిపల్స్, కలెక్టర్ నామినేట్ చేసే ఇతర సభ్యులు అందరూ కలసి సమావేశమై 18వ తేదీకి నివేదిక ఇవ్వాలి. ప్రతి విద్యాసంస్థకూ తనదైన ప్రత్యేక ప్రణాళిక ఉండాలి.

స్కూళ్లు, విద్య, కరోనావైరస్

'అన్ని తరగతులూ తెరవాలి’

తొమ్మిది, ఆపై తరగతులకు మాత్రమే క్లాసులు మొదలుపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. అన్ని తరగతులూ తెరవాలని వారు కోరుతున్నారు.

''తల్లితండ్రులను సంప్రదించకుండా నిర్ణయం చేసేశారు. కేంద్రం అక్టోబరులో అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు నుంచీ నడుస్తున్నాయి. చిన్న పాఠశాలల యాజమాన్యాలు బడులు తెరవాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు కూడా ఆరో తరగతి నుంచి బడులు ఎందుకు ప్రారంభించడం లేదు? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం దూరమైంది. ప్రభుత్వ నిర్ణయం కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసేలా ఉంది. ప్రభుత్వానికి బడులు తిరిగి తెరవడం ఇష్టం లేదు. తక్షణం అన్ని తరగతులూ ప్రారంభించాలి'' అని డిమాండ్ చేశారు తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ.

స్కూళ్లు, విద్య, కరోనావైరస్

పాటించాల్సిన నిబంధనలు:

  • బడికి రావాలని విద్యార్థులను బలవంతం చేయకూడదు.
  • అందరూ మాస్కులు వేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి.
  • శరీర వేడి చూడాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారిని పంపించేయాలి.
  • మనిషికి, మనిషికి మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలి.
  • అన్ని ప్రదేశాలూ శుభ్రం చేయాలి.
  • దగ్గర్లో ఒక హెల్త్ వర్కర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • గదులు, వస్తువులు అన్నీ శుభ్రం చేయాలి. శానిటైజ్ చేయాలి.
  • శానిటైజర్లు, డిసిన్ఫెక్టర్లు, థర్మోమీటర్లు సిద్ధం చేయాలి.
  • తమ పిల్లలు బడికి రావచ్చని తల్లితండ్రులు లిఖితపూర్వక అనుమతినివ్వాలి.
  • హాజరు తప్పనిసరి కాదు.
  • చోటు సరిపోకపోతే ఆరుబయట స్థలం కూడా వాడుకోవచ్చు
  • రెండు ఐసోలేషన్ గదులు ప్రతి సంస్థలోనూ ఉండాలి.
  • కోవిడ్ అనుమానితులు వచ్చినప్పుడు ఏం చేయాలనేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధంగా ఉండాలి.
  • బయటి వాళ్లను రానివ్వకూడదు.
  • వైద్య సిబ్బంది ఫోన్ నంబర్లు ప్రిన్సిపాళ్ల దగ్గర ఉండాలి.
  • కలెక్టర్లు నోడల్ ఆఫీసర్లను నియమించి, తనిఖీ చేయించాలి.
  • స్కూల్, కాలేజీ ఆవరణల్లో జిల్లా కలెక్టరు అనుమతి లేనిదే రాజకీయ మీటింగులు, ఫంక్షన్లు అనుమతించకూడదు.
  • స్కూల్ ఎప్పటి సమయాల్లోనే నడుస్తుంది.
  • మధ్యాహ్నం భోజనం ఇవ్వాలి.
  • పదో తరగతి చివరి పరీక్ష రోజే స్కూలు చివరి పనిరోజు అవుతుంది.
  • హెడ్ మాస్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఏ పాఠశాలకు ఆ పాఠశాల ప్రత్యేకం.
  • హాస్టళ్లు, కిచెన్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
  • 300 కంటే ఎక్కువ మంది ఉన్న కాలేజీలు షిఫ్టుల్లో అంటే ఉదయం 8.30 - 12.30, మధ్యాహ్నం 1.30 నుంచి 5.30 వరకూ విడివిడిగా నడవాలి.
  • పరీక్షల్లో ఏ మార్పూ ఉండదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Schools to reopen in Telangana, Govt issues guidelines
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X