వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1000 బస్సుల రిజిస్ట్రేషన్.. స్కూటర్, ఆటో, గూడ్స్ క్యారియర్లు: యూపీ మంత్రి సిద్దార్థ్

|
Google Oneindia TeluguNews

వలసకూలీలను తరలించే వివాదం ప్రియాంక గాంధీ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్‌గా కొనసాగుతోంది. ప్రియాంక గాంధీ పంపించిన బస్సుల రిజిస్ట్రేషన్ నంబర్లు ఇతర వాహనాలతో ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఒకడుగు ముందుకేసిన మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్.. ఆ బస్సుల రిజిస్ట్రేన్ నంబర్లు స్కూటర్లు, ఆటో, గూడ్స్ క్యారియర్స్ అని ఆరోపించారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది.

బస్సుల నంబర్లు తనిఖీ చేయగా ప్రాథమికంగా తెలిసిందని ఆయన పీటీఐ వార్తాసంస్థతో తెలిపారు. వలసకూలీలు అంటే రాహుల్, ప్రియాంక గాంధీలకు సానుభూతి లేదని.. రాజకీయం చేయాలనుకోవడమే అంతిమ లక్ష్యం అని ఆరోపించారు. వెయ్యి బస్సులు పంపించేందుకు ప్రియాంక అంగీకరించారు. కానీ నిర్దేశిత సమయంలో పంపే విషయమై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా గొడవ జరుగుతోంది.

scooters, autos in Priyanka Gandhi’s list of buses for migrants: up minister

మధ్యాహ్నాం 12 గంటలలోపు బస్సులను పంపాలని నోయిడా, ఘజియాబాద్ పంపాలని యూపీ ప్రభుత్వం కోరగా.. సాయంత్రం 5 గంటలు అని ప్రియాంక చెప్పడం మరో వివాదానికి దారితీసింది. దీనికితోడు యూపీ మంత్రి బస్సుల రిజిస్ట్రేషన్లపై కామెంట్ చేయడంతో మాటలయుద్దానికి దారితీసింది. దీనిపై కాంగ్రెస్, ప్రియాంక గాంధీ స్పందించాల్సి ఉంది.

English summary
Uttar Pradesh state minister Sidharth Nath Singh on Tuesday alleged that the priyanka gandhi send buses had registration numbers of scooters, three-wheelers and goods carriers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X