తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పెషల్ ట్రైన్స్ : వేసవిలో 68 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణమధ్య రైల్వే

|
Google Oneindia TeluguNews

సికింద్రాబాద్ : వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే 68 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలింపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవి హెచ్ఎస్ నాందేడ్ - తిరుపతి, తిరుపతి - నాగర్‌సోల్, తిరుపతి - కాకినాడ టౌన్ - రేణిగుంట కాకినాడ టౌన్ - రాయ్‌చూర్ మరియు కాకినాడ టౌన్ - కర్నూలు సిటీ మధ్య నడవనున్నాయి. వివిధ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

SCR to run 68 Summer Special Trains between Various Destinations

1. హెచ్ఎస్ నాందేడ్ - తిరుపతి - హెచ్ఎస్ నాందేడ్ స్పెషల్ ట్రైన్

హెచ్ఎస్ నాందేడ్ నుంచి తిరుపతి ప్రత్యేక రైలు (రైలు నెం: 07607) నాందేడ్‌లో జూన్ 4వతేదీ, 11వ తేదీ, 18వతేదీ, మరియు 25వ తేదీల్లో సాయంత్రం 06:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం తిరుపతికి 2 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు ప్రతి మంగళవారం ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇక తిరుపతి నుంచి రైలు నెంబరు 07608 హెచ్ఎస్ నాందేడ్‌కు మధ్యాహ్నం 3గంటల45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు చేరుకుంటుంది. ఇక ఈ రైలు జూన్ 5వతేదీ, 12వ తేదీ, 19 తేదీ, మరియు 26వతేదీల్లో నడుస్తుంది.

2. తిరుపతి-నాగర్‌సోల్-తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్స్

తిరుపతి నుంచి నాగర్‌సోల్ వెళ్లే ప్రత్యేక రైలు (07417) తిరుపతిలో ఉదయం 7:30 గంటలకు బయలుదేరి నాగర్‌సోల్‌కు మరుసటి రోజు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 7వతేదీ, 14వతేదీ, 21వతేదీ, 28వ తేదీల్లో నడుస్తుంది. ఇక తిరుగు ప్రయాణం రైలు నెంబరు 07418 నాగర్‌సూల్-తిరుపతి ట్రెయిన్ నాగర్‌సూల్‌లో రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ సర్వీసు జూన్ 8వతేదీ, 15వతేదీ,22వతేదీ మరియు 29వ తేదీల్లో ఉంటుంది.

3. తిరుపతి - కాకినాడ టౌన్- రేణిగుంట జనసందర్శన్ స్పెషల్ ట్రైన్

తిరుపతి -కాకినాడ టౌన్‌ల మధ్య నడిచే జనసందర్శన్ స్పెషల్ ట్రైన్ (07942) తిరుపతిలో సాయంత్రం 7గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. ఈ సర్వీసు జూన్ 2వతేదీ, 9వతేదీ, 16వతేదీ, 23వతేదీ, 30వతేదీల్లో ఉంటుంది. ఇది ఆదివారాల్లో మాత్రమే నడుస్తుంది. ఇక కాకినాడ నుంచి రేణిగుంటకు వెళ్లే ట్రైన్ (07941) కాకినాడ టౌన్‌లో సాయంత్రం 7గంటలకు బయలుదేరి రేణిగుంటకు మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. ఈ సర్వీసు జూన్ 3వతేదీ, 10వతేదీ,17వతేదీ, 24వతేదీ, 1 జూలైలో అందుబాటులో ఉంటుంది.

4. కాకినాడ టౌన్ - రాయ్‌చూర్ - కాకినాడ టౌన్ ట్రైవీక్లీ స్పెషల్ ట్రైన్

కాకినాడ టౌన్ నుంచి రాయ్‌చూర్‌కు రైలు నెంబరు 07245 కాకినాడలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరి రాయ్‌చూర్‌కు మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 2వతేదీ, 5వతేదీ, 7వతేదీ, 9వతేదీ, 12వతేదీ, 14వతేదీ, 16వతేదీ,19తేదీ, 21వతేదీ, 23వతేదీ,26వ తేదీ, 28 వతేదీ మరియు 30వ తేదీల్లో నడుస్తుంది. జూన్‌ నెలలో ప్రతి బుధవారం, శుక్రవారం, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తిరుగు ప్రయాణం ట్రెయిన్ నెంబర్ (07246) రాయ్‌చూర్‌లో మధ్యాహ్నం 2గంటల 5 నిమిషాలకు బయలుదేరి... కాకినాడ టౌన్‌కు మరుసటి రోజు ఉదయం 8 గంటల30 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ సర్వీసు జూన్ 3వ తేదీ, 6వతేదీ, 8వతేదీ,10వతేదీ,13వతేదీ, 15వతేదీ,17వతేదీ,20వ తేదీ, 22వతేదీ,24వతేదీ,27వతేదీ,29వతేదీ జూలై 1వతేదీ నడుస్తుంది.

5. కాకినాడ టౌన్ - కర్నూలు సిటీ - కాకినాడ టౌన్ బైవీక్లీ స్పెషల్ ట్రైన్

రైలు నెంబరు 07237 కాకినాడ టౌన్ నుంచి కర్నూలు సిటీకి వెళ్లే రైలు కాకినాడ టౌనులో సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు కర్నూలుకు చేరుకుంటుంది. ఈ సర్వీసు జూన్ 4వతేదీ, 6వతేదీ,11వతేదీ,13వతేదీ, 18వతేదీ, 20వతేదీ, 25వ తేదీ, మరియు 27వతేదీ నడుస్తుంది. ఇక తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 07238 కర్నూలు సిటీ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు కాకినాడ టౌనుకు చేరుకుంటుంది. ఈ సర్వీసు జూన్ 5వతేదీ, 7వతేదీ, 12 వతేదీ, 14వతేదీ,19వతేదీ,21వతేదీ, 26వతేదీ మరియు 28వ తేదీల్లో నడుస్తుంది.

English summary
In order to clear extra rush of passengers during summer season, SCR will continue to run special trains between , H.S Nanded – Tirupati, Tirupati - Nagarsol, Tirupati - Kakinada Town – Renigunta Kakinada Town – Raichur and Kakinada Town – Kurnool City
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X