వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్తనాదాలు, రక్తపు మరకలు, వణికిపోయిన చిన్నారులు, రన్‌ వేపై భీతావాహ దృశ్యాలు..

|
Google Oneindia TeluguNews

కోజికోడ్ విమాన ప్రమాదంతో రన్ వేపై భీతవాహ వాతావరణం నెలకొంది. ఎయిర్ ఇండియా విమానం రెండు ముక్కలు కావడంతో పైలట్, కో పైలట్ సహా 19 మంది చనిపోయారు. 45 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదం జరిగిన రన్ వే ఆరుపుల ఆర్తనాదాలతో మిన్నంటింది. ఎటుచూసిన రక్తపు మరకలు కనిపించాయి. ఆ సమయంలో చిన్నారులు భయపడి బోరున ఏడ్చేశారు. అంబులెన్స్‌ల రాకతో ఆ ప్రాంగణం సైరన్ల మోత వినిపించింది.

 ఎయిరిండియా విమాన ప్రమాదం: అత్యంత వేగంగా రన్‌వేపైకి, వ్యాలీలో రెండు ముక్కలుగా.. ఎయిరిండియా విమాన ప్రమాదం: అత్యంత వేగంగా రన్‌వేపైకి, వ్యాలీలో రెండు ముక్కలుగా..

విమాన ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో ఉన్న ప్రయాణికుల అరిచారు. విమానంలో కొందరు నాలుగు, ఐదేళ్ల చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వారు సీట్ల కింద ఇరుక్కుపోయారని.. వారిని తీయడానికి కష్టమైందని వివరించారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు సమీపంలో గల ప్రజలు కూడా ముందుకొచ్చారు. తమ కార్లలో కోజికోడ్, మలప్పురంలో గల వివిధ ఆస్పత్రులకు తరలించారు. విమానం ల్యాండయిన సమయంలో పెద్ద శబ్దం విన్నానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

Screams, Blood-Soaked Clothing, Terrified Children At Kozhikode

Recommended Video

Kozhikode : కేరళలో ఘోర ప్రమాదం.. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు ! || Oneindia

రన్ వే పైకి వెళ్లేసరికి కొందరు పరిస్థితి విషమంగా ఉంది అని, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. కొందరికీ కాళ్లు విరిగిపోయాయని.. మరికొందరికీ చేతులు, ఇతర చోట్ల గాయపడ్డారని తెలిపారు. వారిని కాపాడే సమయంలో తన చేతులు, షర్ట్ రక్తం నిండిపోయిందని తెలిపారు. విమానం నుంచి కాక్ పిట్ తీసిన తర్వాత.. పైలట్‌ను బయటకు తీశారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

English summary
Screams of pain, blood soaked clothing, terrified children and the blare of ambulance sirens captured the distressing scene that unfolded at Kozhikode
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X