వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో గృహప్రవేశం: తుపాను దెబ్బ, కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయింది (వీడియో)

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఓఖి తుపాను దెబ్బకు గృహప్రవేశం కాకముందే ఓ ఇల్లు సముద్రంలో కలిసోయింది. ఎంతో కష్టపడి సముద్రతీర ప్రాంతంలోని గ్రామంలో నిర్మించిన ఇంటికి ఇదే నెలలో గృహప్రవేశం చేసి కాపురం పెట్టాలని ఆశపడిన ఆ కుటుంబ సభ్యులకు చివరికి విషాదం మిగిలింది.

తమిళనాడులో భారీ వర్షాలు, 8 మంది మృతి, ఓఖి తుపాను దెబ్బకు హై అలర్ట్, కేరళలో !తమిళనాడులో భారీ వర్షాలు, 8 మంది మృతి, ఓఖి తుపాను దెబ్బకు హై అలర్ట్, కేరళలో !

కన్యాకుమారి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలోని గ్రామంలో నివాసం ఉంటున్న సెంథిల్ పెరుమాల్ అనే ఆయన గ్రామంలోని కొబ్బరి తోటలో ఓ ఇంటిని నిర్మించాడు. ఇంటిని నిర్మించి ఇటీవల పెయింటింగ్ చేయించారు. ఇక కేవలం తలుపులు, కిటికీలు మాత్రమే అమర్చాల్సి ఉంది.

గురువారం సెంథిల్ పెరుమాల్ కొత్త ఇంటి దగ్గర స్నేహితులతో కలిసి పని చేస్తున్నాడు. ఇంతలోనే ఓఖి తుపాను విరుచుకుపడింది. విపరీతమై గాలులతో తుపాను గ్రామం వైపు వచ్చింది. ఇంటిని నిర్మించిన ప్రాంతం వెనుక ఉన్న భూమి కొంచెం కొంచెం కుంగిపోయి సముద్రంలో కలిసిపోతున్న విషయం సెంథిల్ పెరుమాల్ గుర్తించాడు.

తమిళనాడులో తుపాను, కన్యాకుమారి అతలాకుతలం, నలుగురు మృతితమిళనాడులో తుపాను, కన్యాకుమారి అతలాకుతలం, నలుగురు మృతి

ఎక్కడ తన ఇంటి వరకు తుపాను వస్తోందో అంటూ ఆందోళన చెందాడు. సెంథిల్ పెరుమాల్ అనుకున్నట్లే జరిగింది. తుపాను ఒక్క సారిగా ఇంటిని తాకింది. తుపాను దెబ్బకు ఇంటిని నిర్మించిన ప్రాంతంతో పాటు పక్కన ఉన్న భూమి కూడా సముద్రంలో కలిసిపోయింది. తర్వలో గృహప్రవేశం చెయ్యాలనుకున్న ఇల్లు తన కళ్ల ముందే సముద్రంలో కలిసిపోవడంతో సెంథిల్ పెరుమాల్ కుమిలిపోతున్నాడు.

English summary
Sea water enter village in Kanyakumari district, and took away a house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X