వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతనెక్కడ, అణువణువు గాలించండి,లైడిటెక్టర్ పరీక్షలు చేస్తాం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : యూనివర్శిటీని ప్రతి అంగుళం గాలించండి అంటూ పోలీసులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జెఎన్ యూలో అదృశ్యమైన విధ్యార్థి ఆచూకీ కోసం వెయ్యి ఎకరాల యూనివర్శిటీ స్థలంలో ఎక్కడ కూడ వదిలిపెట్టకుండా గాలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జెఎన్ యూ లో కొంత కాలంగా చోటుచేసుకొంటున్న పరిణామాలు దేశాన్ని ఆకర్షించాయి. జెఎన్ యూ విధ్యార్థులు కొందరు ఉరిశిక్ష పడిన టెర్రరిస్టులకు మద్దతు పలికారనే ప్రచారంతో ఈ యూనివర్శిటీ మరోసారి వార్తల్లోకెక్కింది.

ఈ ఘటనపై విధ్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ జైలుకు వెళ్లాడు. కన్హయ్యకు మద్దతుగా , వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చర్చలు సాగాయి. ఇదిలా ఉంటే ఈ ఘటన మరిచిపోక ముందే ఈ యూనివర్శిటీలో చదువుకొనే నజీబ్ అహ్మద్ అనే విధ్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన జరిగి రెండు మాసాలు దాటినా ఆయన ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

అదృశ్యమైన విధ్యార్థి ఎక్కడ

అదృశ్యమైన విధ్యార్థి ఎక్కడ

ఈ ఏడాది అక్టోబర్ లో యూనివర్శిటీ నుండి నజీబ్ అహ్మద్ అదృశ్యం కావడం ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసుల విచారణలో పురోగతి ఆశించిన మేరకు లేదు. నజీబ్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగానే గాలిస్తున్నారు. అయితే ఆయన ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

యూనివర్శిటీ ప్రతి అంగుళం గాలించండి

యూనివర్శిటీ ప్రతి అంగుళం గాలించండి

జెఎన్ యూ విధ్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యంపై పోలీసులు రెండు మాసాలుగా విచారణ చేస్తున్నారు. అయితే కేసులో అనుకొన్న మేర పురగోతి లేదు. ఈ విషయమై బుదవారం నాడు డిల్లీ హైకోర్టు డిల్లీ పోలీసులకు కీలకమైన ఆదేశాలను ఇచ్చింది.యూనివర్శిటీ ప్రాంగణాన్ని ప్రతి అణువు గాలించాలని ఆదేశాలు జారీ చేసింది. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్శిటీ ఉంది. ఈ యూనివర్శిటీని ప్రతి అంగుళం, హాస్టల్, పైకప్పులు, వాటర్ ట్యాంకులను పరిశీలించాలని ఆదేశించింది.ప్రతి అంగుళాన్ని స్కాన్ చేయాలని కోర్టు పోలీసులను కోరింది.

 ఇష్టం లేకే పారిపోయాడా

ఇష్టం లేకే పారిపోయాడా

రెండు మాసాల క్రితం నజీబ్ అహ్మద్ అనే విధ్యార్థి పై నలుగురు విధ్యార్థులు గొడవ పడ్డారని ఆ రోజు రాత్రి నుండి అతను అదృశ్యమయ్యాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఒక విధ్యార్థి సంఘానికి చెందిన వారు ఆయనను బెదిరించారని ఆయన స్నేహితులు ఆరోపిస్తున్నారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే నజీబ్ అహ్మద్ యూనివర్శిటీ నుండి వెళ్ళిపోయాడనే ప్రచారం కూడ ఉంది. అయితే నజీబ్ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడనే విషయమై ఇంకా పూర్తిగా పోలీసులకు ఒక నిర్థారణకు రాలేదు.నజీబ్ యూనివర్శిటీ వెళ్ళిపోయాడనే ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువైంది. అయితే పోలీసులు మాత్రం ఇంకా ఏ విషయాన్ని నిర్థారించలేదు. విచారణను మాత్రం వేగవంతం చేశారు.

 రివార్డును 5 లక్షలకు పెంచారు

రివార్డును 5 లక్షలకు పెంచారు

నజీబ్ అహ్మద్ అచూకీ తెలిపితే 50 వేల రూపాయాల రివార్డును తొలుత ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అయితే రెండు మాసాలు దాటినా ఆయన ఆచూకీ లేకపోవడంతో ఈ రివార్డును 50 లక్షలకు పెంచారు పోలీసులు..అయినా ప్రయోజనం లేకపోయింది.నజీబ్ తల్లి డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె ఈ ఏడాది నవంబర్ లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టులో విచారణ సాగుతోంది.

లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తాం

లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తాం

నజీబ్ అహ్మద్ తో గొడవపడిన నలుగురు విధ్యార్థులకు తాము లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో అనుకొన్న పురోగతి లేదు. కోర్టు మాత్రం నజీబ్ ఆచూకీ కోసం యూనివర్శిటీని గాలించాలని కోరింది. దరిమిలా ఢిల్లీ పోలీసు అధికారి రాహుల్ మెహ్ర ప్రకటించారు.పది రోజుల్లో కేసును కొలిక్కి తీసుకు వస్తామని పోలీసులు ధీమాతో ఉన్నారు.

English summary
search every inch in university premises to trace missing student
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X