సీటు కోరిన దంపతులు. సీటిచ్చి ప్రాణాలు కాపాడుకొన్నాడు
సీటు మారడంతో సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఇండో ర్ పాట్నా రైలు ప్రమాదాన్ని తప్పించుకొన్నారు. సంతోష్ ఎస్ 2 బోగీలో సీటు రిజర్వ్ అయింది. అయితే భార్యభర్తలకు వేర్వేరు బోగిల్లో సీట్లు రిజర్వ్ కావడంతో సంతోష
ఉత్తర్ ప్రదేశ్ :ఉత్తర్ ప్రదేశ్ రైలు ప్రమాదంలో సుమారు 148 మంది మృత్యువాతపడ్డారు.తన సీటు మారడంతో ఓ వ్యక్తి ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయపడ్డాడు. తన సీటును ఇచ్చిన భార్య భర్తలు ప్రాణాలను కోల్పోయారు. తనకు రిజర్వ్ అయిన సీటులో కూర్చొంటే తన ప్రాణాలు కూడ పోయేవని ఆయన చెబుతున్నారు. సీటు మార్చుకొని తన ప్రాణాలు కాపాడిన దంపతులను గుర్తుచేసుకొని మరీ ఆయన విలపిస్తున్నాడు.
ఆదివారం తెల్లవారుజుమాున ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొన్న రైలు ప్రమాదం నుండి సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.తన సీటును భార్యభర్తలకు కేటాయించడంతో తాను ప్రాణాలతో బయటపడినట్టు ఆయన చెప్పారు.

సంతోష్ ఉపాధ్యాయ్ ఇండోర్ పాట్నా రైలులో ప్రయాణం చేస్తున్నాడు. అయితే అతనికి ఎస్ 2 బోగిలో సీటు రిజర్వ్ అయింది. అయితే అదే బోగిలో భార్యభర్తలకు రెండు వేర్వేరు బోగిల్లో సిట్లు లభించాయి. దీంతో ఆ భార్యభర్తలు సంతోష్ ఉపాధ్యాయ్ వద్దకు వచ్చి ప్రాధేయపడ్డాడు.
అయితే వారి పరిస్థితిని అర్థం చేసుకొన్న సంతోష్ ఉపాధ్యాయ్ ఎస్ 5 బోగిలోకి మారాడు. ఇద్దరు భార్యభర్తలు ఎస్ 2 బోగిలో కూర్చున్నారు. రాత్రి పదిన్నర గంటలకు బీనా నుండి రైలు మారే సమయానికి తాము సీట్లు మార్చుకొన్నట్టు సంతోష్ ఉపాధ్యాయ్ గుర్తుకు తెచ్చుకొన్నారు.
తెల్లవారుజాము నాలుగు గంటలకు రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎస్ 1, ఎస్ 2, ఎస్ 3 ఎస్ 4 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.సంతోష్ ఉపాధ్యాయ్ ఎస్ 5 బోగీలోకి మారినందున ఆయన ప్రాణాలు దక్కించుకొన్నాడు.. కాని, ఎస్ 2 బోగలో ఉండి ఉంటే చనిపోయేవాడే. సీటు మార్చి తన ప్రాణాలను ఆ దంపతులు కాపాడారని ఆయన కన్నీరుమున్నీరు అవుతున్నాడు.












Click it and Unblock the Notifications