వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారతీయ విద్యార్థి షాలిని మృతి

అమెరికాలోని టెక్సాస్ నగరంలో హర్వే తుఫాన్ కారణంగా షాలినిసింగ్ అనే భారతీయ విద్యార్థి చనిపోయింది.వరదల్లో కొట్టుకుపోతున్న షాలినిసింగ్‌ను కాపాడి చికిత్స జరిపిన ఆమె మరణించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో భారతీయ విద్యార్థిని షాలిని చనిపోయింది. హర్వే తుపాన్ కారణంగా ఆమె చనిపోయినట్టు అధికారుల ప్రకటించారు.అమెరికాలోని టెక్సాస్ ను హార్వీ తుపాను వణికించిన సంగతి తెలిసిందే.

ఈ తుపానును అమెరికా ప్రభుత్వం పెను ఉపద్రవంగా అభివర్ణించింది. ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న హార్వీ తుపాను... అక్కడి యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని షాలిని సింగ్ (25) ప్రాణాలను కూడా బలిగొంది. తుపాను సమయంలో వరదలో కొట్టుకుపోతున్న నిఖిల్ భాటియా, షాలిని సింగ్ లను కొందరు కాపాడి ఆసుపత్రికి తరలించారు.

Second Indian Student, Rescued From Lake In Hurricane-Hit Texas, Dies

వారికి అత్యవసర చికిత్స అందించారు. అయితే ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. ఢిల్లీకి చెందిన షాలిని గత నెలలోనే అమెరికాకు వెళ్ళింది. డెంటల్ సర్జరీలో డిగ్రీ చేసిన ఆమె అక్కడి యూనివర్శిటీలో పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.

మొత్తం 200 మంది భారతీయ విద్యార్థులు వరదలలో చిక్కుకున్నారు. అయితే, మిగిలిన వారు మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా చనిపోయినవారిలో ఇద్దరు భారతీయ విద్యార్థులు కావడం గమనార్హం.

English summary
A 25-year-old Indian student has died in Houston, days after she was rescued along with another Indian man from a swollen lake in the US state of Texas where Hurricane Harvey wreaked havoc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X