చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహజీవనం చేసిన మహిళకు భార్య హక్కులే: హైకోర్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్ట ప్రకారం పెళ్లిచేసుకోకపోయినా, సహజీవనం చేసిన మహిళకి ఫించను తీసుకునే హక్కు ఉంటుందని మంగళవారం తీర్పు వెలువరించింది.

కోయంబత్తూర్‌ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ స్టాన్లీ రెండో భార్య సుశీల కేసులో మద్రాసు హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్టాన్లీకి 1973, జూన్ 6న సుంగతి అనే మహిళతో వివాహమైంది.

రెండు సంవత్సరాలు జీవనం కలిసి జీవించారు. వీరికి ఒక పాప పేరు రూత్ ఎప్సియా. ఆ తర్వాత మనస్పర్థల వల్ల వీరిద్దరూ విడిపోయారు. మొదటి భార్యతో విడిపోయిన స్టాన్లీ, ఆమెకు విడాకులివ్వకుండానే సుశీల అనే మహిళను జూన్ 23, 1976లో వివాహం చేసుకున్నాడు

Second wife also has legal right to pension, says Madras HC

వీరికి ఒక బాబు పేరు నకీరన్, వయస్సు 35 ఏళ్లు. సుగంతి తన భర్త నుంచి విడాకులు కోరుతూ నవంబర్ 2003లో ఈరోడ్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2005లో సుగంతి మృతిచెందింది. 2001లో పదవీ విరమణ పొందాడు స్టాన్లీ.

అక్టోబర్ 2011లో మరణించిన స్టాన్లీ 2007వ సంవత్సరంలో తన మరణానంతరం తన ఫించను పొందేందుకు అర్హురాలిగా తన రెండో భార్య సుశీలను పేరుని కొయంబత్తూర్ ఎస్పీ వద్ద నమోదు చేయించాడు.

ఈ నేపథ్యంలో తనకు ఫ్యామిలీ ఫించను ఇప్పించవలసిందిగా సుశీల ఎకౌంటెంట్ జనరల్‌కు అప్పీలు చేసింది. అయితే ‘నీవు చట్ట ప్రకారం స్టాన్లీ భార్యవు కాదం'టూ ఆమె ప్రతిపాదనను తిరస్కరించారు. అనంతరం ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

English summary
S Suseela said her husband K Stanley was employed as head constable in Coimbatore district. He married one Suganthi on June 6, 1973. Out of the wedlock, they had girl child who was named Rooth Espia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X