• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్-పాక్ రహస్య శాంతి ప్రణాళిక -యూఏఈ మధ్యవర్తిత్వం -ఇమ్రాన్‌కు మోదీ విషెస్ - త్వరలో సంచలనాలు

|

పొరుగుదేశాలే అయినప్పటికీ, గడిచిన రెండేళ్లుగా ఎలాంటి పలకరింపులు లేకుండా బద్దశత్రువుల్లా వ్యవహరిస్తోన్న భారత్, పాకిస్తాన్‌ మళ్లీ దోస్తానాకు సిద్ధమయ్యాయా? పలు రంగాల్లో పూర్తిగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్దరించుకోనున్నాయా? చైనా చేతిలో పావుగా మారిన దాయాదితో మళ్లీ మంతనాలకు భారత్ సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. సరిహద్దులో కాల్పుల విరమణపై ఇరు సైన్యాలు ఉమ్మడి ప్రకటన చేయడం, చాలా రోజుల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు విషెస్ చెప్పడం శాంతి ప్రణాళికలో భాగమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు చూడబోతున్నామని రిపోర్టుల్లో వెల్లడైంది. దీనికి..

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ

యూఏఈ మధ్యవర్తిత్వం

యూఏఈ మధ్యవర్తిత్వం

భారత్, పాకిస్తాన్ మధ్య రహస్య శాంతి ప్రణాళిక అమలవుతున్నదని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వంతో ఇదంతా జరుగుతున్నదని విశ్వసనీయ వర్గాలను కోట్ చేస్తూ ప్రఖ్యాత బ్లూమ్స్ బర్గ్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. రెండేళ్లుగా దాదాపు యుద్దభాషలోనే మాట్లాడుకున్న ఇండియా, పాకిస్తాన్ సైన్యాలు.. గత నెలలో ‘సరిహద్దు వద్ద కాల్పులకు చరమగీతం పాడుతున్నాం'అంటూ ఉమ్మడి ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయేద్ (ఫిబ్రవరి 26న) ఢిల్లీకి విచ్చేసి, మన విదేశాంగ మంత్రి జైశకంర్ తో భేటీ అయ్యారు. ముందస్తు అజెండా లేకుండా సాగిన ఆ భేటీకి సంబంధించి.. ‘రెండు దేశాల ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాలను చర్చించార'నే రొటీన్ ప్రకటన వెలువడగా, తెరవెనుక మాత్రం పెద్ద మంత్రాంగమే సాగినట్లు తెలుస్తోంది.

షాకింగ్: నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను -ఇంటర్‌పోల్ దర్యాప్తు -ఎస్ఈసీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్షాకింగ్: నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను -ఇంటర్‌పోల్ దర్యాప్తు -ఎస్ఈసీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్

యూఏఈ మధ్యవర్తిత్వం

యూఏఈ మధ్యవర్తిత్వం

భారత్, పాకిస్తాన్ మధ్య రహస్య శాంతి ప్రణాళిక అమలవుతున్నదని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వంతో ఇదంతా జరుగుతున్నదని విశ్వసనీయ వర్గాలను కోట్ చేస్తూ ప్రఖ్యాత బ్లూమ్స్ బర్గ్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. రెండేళ్లుగా దాదాపు యుద్దభాషలోనే మాట్లాడుకున్న ఇండియా, పాకిస్తాన్ సైన్యాలు.. గత నెలలో ‘సరిహద్దు వద్ద కాల్పులకు చరమగీతం పాడుతున్నాం'అంటూ ఉమ్మడి ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయేద్ (ఫిబ్రవరి 26న) ఢిల్లీకి విచ్చేసి, మన విదేశాంగ మంత్రి జైశకంర్ తో భేటీ అయ్యారు. ముందస్తు అజెండా లేకుండా సాగిన ఆ భేటీకి సంబంధించి.. ‘రెండు దేశాల ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాలను చర్చించార'నే రొటీన్ ప్రకటన వెలువడగా, తెరవెనుక మాత్రం పెద్ద మంత్రాంగమే సాగినట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఎంబసీల రీఓపెనింగ్

త్వరలోనే ఎంబసీల రీఓపెనింగ్


పుల్వామా దాడి అనంతరం వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం, ఇస్లామాబాద్ లోని భారత్ రాయబారకార్యాలయం మూతపడ్డాయి. ఆర్మీ హాట్ లైన్లు తప్ప ఇరువురి మద్య ఎక్కడా చర్చలు జరగలేదు. అదే సమయంలో పలు అంతర్జాతీయ వేదికలపై పాక్ దురాగతాన్ని, ఉగ్ర కార్ఖానాగా అది వ్యవహరిస్తోన్న తీరునుభారత్ ఎడగడుతూ వచ్చింది. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేతపై పాక్ లొల్లి చేయాలనుకున్నా, యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలు అందుకు నో చెప్పడం, భారత్ అంత్గత వ్యవహారాల్లో జోక్యం వద్దని హితవు పలకడం తెలిసిందే. ఇటీవల కాలంలో పాక్ చైనాకు దగ్గరవ్వగా, పాక్ తో కంటే భారత్ తోనే అన్ని విధాలా లాభం పొందుతోన్న యూఏఈ మధ్యవర్తిత్వానికి సైతం పూనుకుందని, ఆ ఫలితంగానే కాల్పుల విరమణపై ఉమ్మడి ప్రకటన వెలువడిందని, శాంతి ప్రణాళికలో తర్వాతి ఘట్టంగా ఎంబసీల రీఓపెనింగ్ ఉంటుందని బ్లూమ్స్ బర్గ్ పేర్కొంది.

అమెరికా ఆదేశాల మేరకేనా?

అమెరికా ఆదేశాల మేరకేనా?

ట్రంప్ ఏలుబడిలో అమెరికా పెద్దన్న పాత్ర బలహీనపడటం, ప్రపంచ దేశాలన్నీ వేర్వేరు ప్రయోజనాల రీత్యా ఆ మేరకు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న క్రమంలో జోబైడెన్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మళ్లీ అన్ని దేశాలతో సంబంధాలను రివ్యూ చేసుకుంటున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ ఈ మేరకు వరుసగా విదేశీ పర్యటనలు చేపట్టారు. అస్టిన్ రెండ్రోజుల కిందటే భారత్ కూడా వచ్చివెళ్లారు. కాగా, అఫ్టానిస్తాన్ విషయంలో విస్తృత స్థాయి పరిష్కారాలు చూపాలనుకుంటోన్న జోబైడెన్.. ఆ ప్రక్రియలో పాకిస్తాన్, భారత్ లను కూడా కలుపుకొని పోవాలనుకుంటున్నారని, అది జరగాలంటే ముందు భారత్, పాక్ ల మధ్య కనీసం మాట, మంతి కొనసాగాల్సి ఉంటుందని, యూఏఈ మద్యవర్తిత్వంలో ‘అమెరికా కోణం' కూడా ఉందని కథనంలో పేర్కొన్నారు. నిజానికి..

ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ విషెస్

ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ విషెస్

యూఏఈ మద్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య సాగుతోన్న రహస్య శాంతి ప్రణాళిక అచ్చంగా అమెరికా ప్రయోజనాల కోసమే అనుకోడానికీ వీల్లేదని, మళ్లీ వ్యాపార, వాణిజ్య, దౌత్య సంబంధాలను పున:ప్రారంభించడం ద్వారా రెండు దేశాలూ లబ్దిపొందే వీలుందని కథనంలో తెలిపారు. చైనాను కట్టడి చేసే దిశగా బైడెన్ బృందం ఇండో పసిఫిక్ రీజియన్ లో కీలక కార్యకలాపాలు నెరపుతుండటం, చైనాను నిలువరించాలని ప్రధని మోదీ కూడా భావిస్తున్నందున అందుకు ఉపకరించే ప్రతి అవకాశాన్నీ వాడుకోవాలని భారత్ యోచిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య మారిన సంబంధాలకు గుర్తుగా మన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం(మార్చి 21న) పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు విషెస్ తెలిపారు. కరోనా బారిపడ్డ పాక్ ప్రధాని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు.

English summary
Aday after military chiefs from India and Pakistan surprised the works last months with joint commitment to respect the ceasefire agreement from 2003, a top diplomat of the UAE came to visit New Delhi for a one day visit. The official UAE readout of the meeting on February 26 suggested what Foreign Minister Sheikh Abdullah bin Zayed spoke about with Foreign Minister S Jaishankar, noting they “discussed all regional and international issues of common interest and exchanged views on them”, a report in Bloomberg said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X