హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ 'పులి' ఘటన: జూపార్క్‌ల్లో భద్రత మరింత పటిష్టం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/చెన్నై/బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీలోని జూపార్కులో మంగళవారం ఓ విద్యార్థి పులి ఎన్‌క్లోజర్‌లోకి దిగి దాని దెబ్బకు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో గల జంతు ప్రదర్శన శాలలో రక్షణ చర్యలు మరింత పటిష్టం చేశారు.

ఢిల్లీలోని జూపార్క్‌లో ఘోరం నేపథ్యంలో పలు జూపార్క్‌ల్లోని రక్షణ చర్యల పట్ల, జంతువులు, క్రూర మృగాల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల అనుమానాలు కలుగుతున్నాయి.

 జూపార్క్

జూపార్క్

కాగా, హైదరాబాదులో 20 ఏళ్ల క్రితం జూపార్కు వెనుక ప్రాంతమైన మీరాలం చెరువు సమీపంలోని ఓ కాలనీకి చెందిన ఒక బాలుడు ఎత్తైన ప్రహారీ ఎక్కి సఫారీ పార్కులో దిగి పులి పంజాకు గురయ్యాడు.

జూపార్క్

జూపార్క్

ఓ వ్యక్తి సఫారీలో దిగి పులి చర్మాన్ని వలచుకుపోయిన సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. 2007లో జూపార్కును తిలకించడానికి వచ్చిన ఓ సందర్శకుడు సరదాగా పులి బోనులో చేయి పెట్టడంతో పులి అతడి చేయిని కొరికేసింది.

 జూపార్క్

జూపార్క్

ఇవి కాకుండా జూపార్కులో మరికొన్ని సంఘటనలు జరిగినా ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోను జూలలో కూడా రక్షణ చర్యలు పటిష్టం చేశారు.

జూపార్క్

జూపార్క్

దేశ రాజధాని ఢిల్లీలోని జూపార్కులో మంగళవారం ఓ విద్యార్థి పులి ఎన్‌క్లోజర్‌లోకి దిగి దాని దెబ్బకు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

English summary
Chennai zoo's security has been beefed up because of yesterday's Delhi incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X