వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: స్టేటస్ సింబల్ కాదంటూ అమిత్ షా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎస్పీజీ సవరణ బిల్లుకు మంగళవారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ ప్రారంభించగానే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మూజువాణి ఓటింగ్ జరిపడంతో బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభలో ఇంతకుముందే ఈ బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే.

సభలో గాంధీ కుటుంబసభ్యులకు ఎస్పీజీ భద్రతను తొలగించడాన్ని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. ఎస్పీజీ సవరణ బిల్లును కేవలం గాంధీల కుటుంబాన్ని ఉద్దేశించి చేయడం లేదని, ఎస్పీజీ చట్టాన్ని సవరించడం ఇది ఐదోసారి అని చెప్పారు.

Security Can’t Be Status Symbol, Says Amit Shah as RS Passes SPG Bill

ఈ సవరణ కేవలం గాంధీ కుటుంబసభ్యులను దృష్టిలో పెట్టుకుని చేసింది కాదని తెలిపారు. అయితే, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనని.. గతంలో చేసిన నాలుగు సవరణలు మాత్రం పక్కా వారి కుటుంబం కోసం చేసినవేనని అమిత్ షా వ్యాఖ్యానించారు.

తాము గాంధీ కుటుంబసభ్యులకు సీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించామని, వారు భూమి మీదనే అత్యధిక భద్రతను కలిగి ఉన్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పదవి నుంచి వైదొలగిన ఐదేళ్లకు ఈ ఎస్పీజీ భద్రత ఉండదని స్పష్టం చేశారు. ఒక్క గాంధీ కుటుంబానికే కాకుండా ఇతర మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ భద్రత తొలగించినట్లు అమిత్ షా వివరించారు.

తాము ఏ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, అయినా ఆ ఒక్క కుటుంబ భద్రత గురించే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అమిత్ షా ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతోపాటు 130 కోట్ల మంది భారతీయులను కూడా రక్షించడం ప్రభుత్వం బాధ్యత అని అమిత్ షా స్పష్టం చేశారు. ఎస్పీజీ భద్రత ఇక స్టేటస్ సింబల్‌గా ఉండబోదని అన్నారు.

English summary
Special Protection Group (Amendment) Bill has been passed in the Rajya Sabha. The amendment Bill has several changes and one of them is that the family members of a former prime minister who don't reside with him at his official residence will not be guarded by SPG commandos anymore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X