వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటెత్తుతోన్న ట్రాక్టర్లు: ఢిల్లీ చుట్టూ.. మూడు మార్గాల్లోనే: కనీవినీ ఎరుగని భద్రత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను ఏర్పాటు చేశారు. దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని దృష్టిలో ఉంచుకుని.. అన్ని ప్రాంతాల్లోనూ భారీ భద్రతా చర్యలను తీసుకున్నారు. అనేక మార్గాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి- ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన మార్గాలను అనుసంధానించే రోడ్లన్నింటినీ మూసివేశారు.

ఒకవంక గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం న్యూఢిల్లీ ముస్తాబు కాగా.. అదే సమయంలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించబోతోండటం వల్ల ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. అడుగడుగునా బ్యారికేడ్లను అమర్చారు. ర్యాలీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ వైపు వందలాదిగా ట్రాక్టర్లు.తరలివస్తున్నాయి. ట్రాక్టర్ ర్యాలీలో మరే ఇతర వాహానాలను గానీ ప్రదర్శించకూడదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎడ్ల బండ్లు, ఒంటెల బండ్లు, ఆటోలు, జేసీబీలు, ఇతర వ్యవసాయాధారిత వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Security tightened in various parts of the Delhi head of Farmers tractor rally

మూడు మార్గాల్లో మాత్రమే ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. టిక్రి వైపు నుంచి ఢిల్లీలో ప్రవేశించే ట్రాక్టర్లు నంగ్లోయ్, నజఫ్‌గఢ్, వెస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ మీదుగా బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే ఘాజీపూర్ వైపు నుంచి వచ్చే ట్రాక్టర్లు 56 ఫీట్ రోడ్ వరకు వెళ్లి మళ్లీ కుండ్లీ-ఘజియాబాద్, పల్వల్ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లిపోవాల్సి ఉంటుంది. సింఘు సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించి ట్రాక్టర్లు.. కంఝావాలా, బవానా, ఔచండి బోర్డర్, కేఎంపీ ఎక్స్‌ప్రెస్ మీదుగా వెళ్లి.. మళ్లీ ఇదే సింఘు బోర్డర్ నుంచి బయటికి వెళ్లి పోవాల్సి ఉంటుందని ఢిల్లీ స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు.

ర్యాలీ సందర్భంగా రైతులెవరూ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా వ్యవహరించకూడదని సూచించామని అన్నారు. నిర్దేశిత మార్గాల్లోనే ర్యాలీని నిర్వహించాల్సి ఉంటుందని ఆదేశించినట్లు చెప్పారు. జీటీ కర్నాల్ రోడ్‌, ఐటీఓ, యమునా బ్రిడ్జి, సుబ్రమణియన్ భారతి మార్గ్‌లో బ్యారికేడ్లను అమర్చారు. ఎక్కడికక్కడ రహదారులను మూసివేయడంతో అవుటర్ రింగ్ రోడ్, బద్లీ రోడ్, కేఎన్ కట్జూ మార్గ్, మధుబన్ చౌక్, కంజావాలా రోడ్, పల్లా రోడ్, నరేలా వంటి మార్గాల్లో భారీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

English summary
The farmers' big tractor rally on Republic Day, one of the key participants the Kisan Mazdoor Sangharsh Committee -- declared that it would not stick to the route agreed upon by the Samyukt Kisan Morcha and the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X