వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తాజ్‌మహల్' ఇక దూరం నుంచి చూడాల్సిందే: 'టచ్' చేసే ఛాన్స్ లేదు!..

ప్రేమకు చిహ్నంగా ప్రపంచ సందర్శకులను కట్టిపడేసే తాజ్‌మహల్ కు జనాల తాకిడి ఎక్కువ. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులు, ప్రేమికులు తాజ్‌మహల్ ఎదుట ఒక్క ఫోటో అయినా దిగాలని ఆరాటపడుతుంటారు.

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: ప్రేమకు చిహ్నంగా ప్రపంచ సందర్శకులను కట్టిపడేసే తాజ్‌మహల్ కు జనాల తాకిడి ఎక్కువ. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులు, ప్రేమికులు తాజ్‌మహల్ ఎదుట ఒక్క ఫోటో అయినా దిగాలని ఆరాటపడుతుంటారు. ఒక్కసారి ఆ ప్రేమ ప్రతీకను తాకి పరవశించిపోతారు.

కానీ భవిష్యత్తులో ఇక తాజ్ మహల్ ను ప్రత్యక్షంగా తాకే అవకాశం ఉండకపోవచ్చునేమో!. ఆర్కియాలజీ అధికారులు చెబుతున్న ప్రకారం.. సందర్శకుల తాకిడి ఎక్కువై, తాజ్ మహల్ ను వారు ప్రత్యక్షంగా తాకడం ద్వారా దాని సహజత్వాన్ని కోల్పోవడమే కాకుండా ఆ కట్టడం కాలుష్యం కోరల్లో చిక్కుపోతున్నట్లు గుర్తించారు.

See, but don't touch: Taj Mahal to soon be barricaded against visitors

దీంతో తాజ్ మహల్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇదే గనుక జరిగితే.. ఇక సందర్శకులకు తాజ్ మహల్ ను ప్రత్యక్షంగా తాకే అవకాశం ఉండనట్లే. గత కొన్నేళ్లుగా తాజ్ మహల్ కాలుష్యం బారిన పడుతుండటంతో ప్రస్తుతం ఆ కట్టడానికి మడ్ థెరపీ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే.. సందర్శకులు దాన్ని తాకకుండా ఉండేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీన్నిబట్టి ఇకపై ఆగ్రాకు వెళ్లే సందర్శకులు తాజ్‌మహల్ ను దూరం నుంచే చూసి సంతృప్తి చెందాలన్నమాట.

English summary
Taj Mahal will soon be out of your touch, as the Archaeological Survey of India plans to barricade it against the countless visitors who flock to the monument every year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X