వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన?: సంతకాలు సేకరిస్తున్న కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్‌ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు భారత జాతీయ కాంగ్రెస్‌(ఐఎన్‌సీ) బుధవారం పేర్కొంది. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలు అన్నింటితో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టు రోస్టర్‌ (ఏ కేసును ఎవరు విచారించాలనే నిర్ణయం) కేటాయింపులు సమతూకంతో ఉండటం లేదని సీజేఐ దీపక్‌ మిశ్రాపై వ్యతిరేకతను నలుగురు సీనియర్‌ జడ్జిలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

 Seeking Impeachment Of Chief Justice Dipak Misra, Opposition Gathers Signatures

ఈ ఘటన ఆధారంగానే కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షాల మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తోందని తెలిసింది. భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీలు, 50 మంది రాజ్యసభ ఎంపీల మద్దతు అవసరం.

కాగా, ఇందుకోసం కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఎంపీల సంతకాలను సేకరించడం ప్రారంభించిందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) నాయకుడు శరద్‌ పవార్‌ తెలిపారు. అభిశంసన తీర్మాన పత్రంపై తాను ఇప్పటికే సంతకం చేసినట్లు ఎన్‌సీపీకి చెందిన మరో ఎంపీ డీపీ త్రిపాఠి వెల్లడించారు. మూడు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికే ఈ తీర్మానం సంతకం చేసినట్లు తెలిసింది.

English summary
The Congress, backed by several opposition parties, is reportedly leading efforts to bring an impeachment motion in parliament against Chief Justice of India Dipak Misra. The parties are circulating an unprecedented petition for sacking the top judge, leaders of the Nationalist Congress Party (NCP) have confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X