వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019 ఎన్నికలు : ఒకటి కాదు రెండు కాదు 3 వేల 456 కోట్లు స్వాధీనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఒకటి కాదు రెండు కాదు .. అక్షరాల 3 వేల 456 కోట్ల రూపాయల విలువజేసే నగదు, బంగారం, గంజాయిని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఇంత భారీస్థాయిలో నగదు పట్టుబడలేదని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దేశంలో 90 ఓట్ల మంది ఓటర్లు తమ వజ్రాయుధమైన ఓటే హక్కు వినియోగించుకునేందుకు ఆయా పార్టీల జోరుగా ప్రలోభాల పర్వానికి తెరలేపాయి.

ఏరులైపారిన మందు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సందర్భంగా క్యాష్, డ్రగ్స్, మందును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మొత్తం మే 20 తేదీ వరకు పట్టుబడ్డ మొత్తం అని .. 3 వేల 456.33 కోట్లు అని పేర్కొన్నారు. తమిళనాడులోని వెల్లూరులో ధనప్రవాహం ఎరులై పారడంతో ఎన్నికల సంఘం కలుగజేసుకొని ఎన్నికనే రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. వెల్లూరులో 10.48 కోట్ల నగదును డీఎంకే కార్యకర్త నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇంకా ఎంత నగదు పంచి ఎన్నికను అపహాస్యం చేస్తారని ఈసీ కలుగజేసుకుని లోక్ సభ ఎన్నికను రద్దుచేసింది.

Seizure worth Rs 34,56,22,00,000 during 2019 LS polls

300 కోట్ల నగదు
2014లో కేవలం 300 కోట్ల నగదు మాత్రమే పట్టుబడినట్టు అప్పటి అధికారుల సమర్పించిన వివరాలు ఆధారంగా తెలుస్తోంది. ఇందులో 1.61 లక్షల లిక్కర్, 17 వేల కేజీల డ్రగ్స్ ఉన్నాయి. అంతేకాదు 2014లో పట్టుబడ్డ నగదు 2011లో షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు వచ్చిన విరాళాలతో సమానంగా ఉండటం గమనార్హం. ఇక డ్రగ్స్ మూడు పెద్ద మగ ఏనుగులు, ఒక చిన్న ఏనుగు బరువుతో సమానం. ఒక్కో ఏనుగు 5 వేల కిలోల బరువు ఉంటుంది. అలాగే అప్పుడు పట్టుబడ్డ మద్యం ఆరున్నర ఒలంపిక్ స్విమ్మింగ్ ఫూల్ నింపొచ్చని వివరాలు వెల్లడిస్తున్నాయి. తర్వాత ఐదేళ్లలో ఈ నగదు పదింతలు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది.

English summary
in case you have not realised it yet, in one form or the other you are witness to history unfold before you. Never before did it happen that 900 million (90 crore) people enjoyed the power to decide who will govern them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X