• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: భర్తకు అరటి పండు, ప్రియుడికి జామపండు, మిడ్ నైట్ మసాలా, థ్రిల్లర్ సినిమా !

|

చెన్నై: పెద్దలు చూసిన వ్యక్తిని ఓ యువతి వివాహం చేసుకుంది. తన కంటే తన భర్త వయసులో 17 సంవత్సరాలు పెద్దవాడని, అతనితో తాను ఎలా కాపురం చెయ్యాలని ఆ యువతి చాలా కాలం నుంచి రగిలిపోతుంది. సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. నిత్యం తన భార్య మొబైల్ ఫోన్ లో ప్రియుడితో వీడియో కాల్స్, సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తోందని గుర్తించిన భర్త అతని భార్య దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొన్నాడు. ప్రియుడు మరో ఫోన్ తీసివ్వడంతో భర్త బయటకు వెళ్లిన తరువాత సీక్రేట్ ఫోన్ తో ప్రియుడితో భార్య వీడియో కాల్స్ లో మాట్లాడుతూ కాలం గడిపేసింది. భార్య అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఆమెను బెండ్ తీశాడు. తన భార్య దగ్గర మరో ఫోన్ ఉందని తెలుసుకున్న భర్త మరోసారి ఆమెను చితకబాదేశాడు. తన భర్త బతికుంటే తాను ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి చాన్స్ చిక్కదని భార్య తెలుసుకుంది. అంతే సినిమా స్క్రీప్టు టైపులో మిడ్ నైట్ భర్తను చంపిసిన భార్య ఇంట్లో నగలు ప్రియుడికి ఇచ్చేసి పోలీసుల ముందు థ్రిల్లర్ సినిమా స్టోరీ చెప్పింది.

Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, చంపేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య, కట్ చేస్తే !Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, చంపేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య, కట్ చేస్తే !

 దంపతులకు వయసులో 17 ఏళ్లు తేడా

దంపతులకు వయసులో 17 ఏళ్లు తేడా

తమిళనాడులోని సేలంలోని అమ్మాపేట మార్కెట్ వీధిలో ప్రభు (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఐదు సంవత్సరా క్రితం షాలిని (22) అనే యువతితో ప్రభు వివాహం జరిగింది. తనకంటే వయసులో 17 సంవత్సరాల పెద్దవాడైన ప్రభును పెళ్లి చేసుకోనని అప్పట్లోనే షాలిని మొండి చేసిందని సమాచారం.

 కళ్లు మూసుకుని కాపురం చేస్తున్న భార్య

కళ్లు మూసుకుని కాపురం చేస్తున్న భార్య

కుటుంబ సభ్యులు బలవంతం చెయ్యడంతో షాలిని పెళ్లి చేసుకుని ప్రభుతో కాపురం చెయ్యడంతో 18 నెలల పాప ఉంది. భర్త ప్రభుతో ఆమె భార్య షాలిని ఇష్టం ఉండిలేనట్లు కళ్లు మూసుకుని కాపురం చేస్తోందని సమాచారం. సేలంలోని మార్కెట్ వీధిలో ప్రభు సొంతంగా అరటి పండ్లు హోల్ సేల్ మండీ నిర్వహిస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు.

 భార్యకు సోషల్ మీడియా ఫ్రెండ్

భార్యకు సోషల్ మీడియా ఫ్రెండ్

ప్రభు అతని భార్య షాలినీ కోసం మంచి స్మార్ట్ ఫోన్ ఒకటి తీసిచ్చాడు. స్మార్ట్ ఫోన్ లో నిత్యం సోషల్ మీడియాలో కాలం గుడుపుతున్న షాలినీకి సెల్వరాజ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం షాలినీ, సెల్వరాజ్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్నారు. తరువాత షాలినీ, సెల్వరాజ్ యవ్వారం కాస్తా వీడియో కాల్స్ వరకు వెళ్లింది.

 భర్త అరటికాయలతో బిజీ..... ప్రియుడు జామకాయలతో బిజీ

భర్త అరటికాయలతో బిజీ..... ప్రియుడు జామకాయలతో బిజీ

సోషల్ మీడియా ఫ్రెండ్ సెల్వరాజ్ తో ప్రభు భార్య షాలినీ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ప్రభు బయటకు వెళ్లి అరటి కాయల మండీలో బిజీగా ఉంటే షాలినీ ఆమె ప్రియుడు సెల్వరాజ్ ను ఇంటికి పిలిపించుకుని అతనికి జామకాయలు ఇచ్చి అతనితో మస్త్ మజా చేస్తూ ఎంజాయ్ చేసింది.

 మొబైల్ లాక్కొన్న భర్త

మొబైల్ లాక్కొన్న భర్త

ప్రతిరోజు షాలినీ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ప్రియుడు సెల్వరాజ్ తో వీడియో కాల్స్ లో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తోంది. ప్రతినిత్యం తన భార్య షాలినీ సోషల్ మీడియాలో కాలం గడుపుతోందని తెలుసుకున్న భర్త ప్రభు రగిలిపోయాడు. నిత్యం తన భార్య షాలినీ మొబైల్ ఫోన్ లో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తోందని గుర్తించిన భర్త ప్రభు ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొన్నాడు.

 సీక్రేట్ గా ఫోన్ తీసిచ్చిన ప్రియుడి

సీక్రేట్ గా ఫోన్ తీసిచ్చిన ప్రియుడి

ఒక్కసారిగా షాలినీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ మాయం కావడంతో ఆమె ప్రియుడు సెల్వరాజ్ తో మాట్లాడలేక, చాటింగ్ చెయ్యలేక ఇబ్బంది పడింది. ప్రియుడు సెల్వరాజ్ మరో ఫోన్ తీసివ్వడంతో భర్త ప్రభు బయటకు వెళ్లిన తరువాత సీక్రేట్ ఫోన్ తో షాలినీ ఆమె ప్రియుడితో మాట్లాడుతూ కాలం గడిపేసింది.

 పక్కింట్లో చెబితే భార్యకు బెండ్ తీసిన భర్త

పక్కింట్లో చెబితే భార్యకు బెండ్ తీసిన భర్త

నువ్వు బయట బిజీగా ఉన్న సమయంలో ఓ యువకుడు మీ ఇంటికి వచ్చి వెలుతున్నాడని చుట్టుపక్కల వాళ్లు ప్రభుకు చెప్పారు. భార్య షాలినీ మీద నిఘా వేసిన ఆమె భర్త ప్రభు కొన్ని రోజులు ఏం జరుగుతుందో అంటూ ఆరా తీశాడు. ప్రియుడు సెల్వరాజ్ ఇంట్లో దూరి షాలినీతో సరసాలు ఆడుతున్న సమయంలో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త ప్రభు ఇద్దరిని పట్టుకుని చితకబాదేశాడు.

 అర్దరాత్రి ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

అర్దరాత్రి ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

ఇంకోసారి ఇలా జరిగితే ఇద్దరిని చంపేసి జైలుకు పోతానని ప్రభు అతని భార్య షాలినీ, ప్రియుడు సెల్వరాజ్ కు వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. తన భర్త ప్రభు బతికుంటే తాను ప్రియుడు సెల్వరాజ్ తో ఎంజాయ్ చెయ్యలేనని భార్య షాలినీ తెలుసుకుంది. అర్దరాత్రి ప్రభు మద్యం సేవించి నిద్రపోతున్న సమయంలో షాలినీ ఆమె ప్రియుడు సెల్వరాజ్ ను ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడు సెల్వరాజ్ తో కలిసి భర్త ప్రభును కత్తులతో పొడిచి చంపేసిన షాలినీ గంట తరువాత పోలీసులకు ఫోన్ చేసి సినిమా స్టోరీ చెప్పింది.

 భార్య బండారం బయటపడింది

భార్య బండారం బయటపడింది

అర్దరాత్రి 1 గంట సమయంలో తన ఇంట్లోకి దొంగలు చొరబడ్డారని, తన భర్త ప్రభును కత్తులతో పొడిచి చంపేసి తన దగ్గర ఉన్న బంగారు నగలు మొత్తం లాక్కొని వెళ్లిపోయారని షాలినీ పోలీసులకు థ్రిల్లర్ సినిమా స్టోరీ చెప్పింది. అయితే ప్రభును అతని భార్య షాలినీ చంపేసి ఉంటుందని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని ప్రభు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు షాలినీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. తన భర్తను తానే హత్య చేశానని షాలినీ అంగీకరించింది.

 పోలీస్ స్టేషన్ వెనుక ఇంట్లో హత్య

పోలీస్ స్టేషన్ వెనుక ఇంట్లో హత్య

సినిమా స్కెచ్ తో ప్రియురాలు షాలినీ బంగారు నగలు ఎత్తుకుని పారిపోయిన ఆమె ప్రియుడి కోసం సేలం పోలీసులు గాలిస్తున్నారు. సేలం పోలీస్ స్టేషన్ వెనుకనే నివాసం ఉంటున్న ప్రభు అతని భార్య షాలినీ చేతిలో దారుణ హత్యకు గురి కావడంతో సేలం ప్రజలు ఉలిక్కిపడ్డారు. అక్రమ సంబంధం కారణంగా భర్తను చంపేసిన షాలినీ జైలుపాలు కావడం సేలంలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Illegal relationship: Selam Ammapettai Police arrest wife for murdering her husband as she had an illegal affair with someone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X