వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వయంఉపాధి-కొత్త ఉద్యోగాలు: మోడీ ప్రభుత్వంలో ముద్ర యోజన

ముద్ర యోజన కింద కేంద్ర ప్రభుత్వం చిన్న తరహా సంస్థలకు రుణసదుపాయం కల్పిస్తుంది. ఇటీవల ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ భారత యువతపై సర్వే చేసింది.

By Nitin Mehta And Pranav Gupta
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముద్ర యోజన కింద కేంద్ర ప్రభుత్వం చిన్న తరహా సంస్థలకు రుణసదుపాయం కల్పిస్తుంది. ఇటీవల ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ భారత యువతపై సర్వే చేసింది. ఈ సర్వేలో యువతకు నిరుద్యోగం అత్యంత ఆందోళనకర విషయమని తేలింది.

ప్రతి ఏటా చదువుకొని బయటకు వస్తున్న లక్షలాది యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ. ఇందులో భాగంగా ముద్ర యోజన (మైక్రో యూనిట్ డెవలప్‌మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ)ని తీసుకు వచ్చారు.

యువతకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ముద్ర యోజనను తీసుకు వచ్చారు. ఇది యువతకు స్వయంఉపాధి కల్పిస్తుంది. ముద్ర యోజన ద్వారా చిన్న చిన్న సంస్థలకు, ఎంటర్‌ప్రెన్యూయర్స్‌కు ఉపాధి దొరుకుతుంది.

Self Employment and Job Creation: Tracking the Progress of Mudra Yojana under Modi

దీనిని 2015 యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ఆగస్టులో లాంఛనంగా ప్రారంభించారు. చిన్న సంస్థలకు, యువతకు ఉపాధి కోసం గత ప్రభుత్వాలు కూడా పథకాలు తెచ్చాయి. కానీ వాటి పరిమిత ప్రయోజనం కారణంగా ముద్ర యోజన తీసుకు వచ్చారు.

ముద్ర యోజన అంటే ఏమిటి?

ముద్ర యోజన కింద.. చిన్న సంస్థలకు ప్రభుత్వం రీఫైనాన్స్ చేస్తుంది.
వ్య‌వ‌సాయేత‌ర రంగాలైన త‌యారీ, వాణిజ్యం, సేవా రంగాల్లో రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప్ర‌భుత్వం క‌ల్పించే రుణ‌మే ముద్రా రుణం. ఈ ర‌క‌మైన రుణాల‌ను ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్ర‌యివేటు బ్యాంకులు, స‌హ‌కార బ్యాంకుల నుంచి పొంద‌వ‌చ్చు. ప్ర‌ధాన మంత్రి ముద్రా యోజ‌న కింద ఈ రుణాల‌ను అంద‌జేస్తారు. వీటితో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థ‌లు సైతం రుణాల‌నందించేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. అయితే ఇందుకోసం అవి కొన్ని అర్హ‌త ప్ర‌మాణాల‌ను పాటించాల్సి ఉంటుంది.

1. శిశు: రూ.50,000 వరకు లోన్
2. తరుణ: రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు లోన్
3. మధుర్: రూ.5 లక్షలకు పైన లోన్

ఎవరు అర్హులు?

ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో రుణాలు పొందేందుకు అర్హులు. రుణ అవసరం పది లక్షల లోపు అవసమై ఉండాలి.

వార్షిక ప్రాతిపదికణ రుణాలు మంజూరులో స్థిరత్వం

గత ఆర్థిక సంవత్సరం ముద్ర యోజన వల్ల గణనీయమైన ప్రయోజనం చేకూరింది. 2015-16లో దాదాపు 3.5 కోట్ల రుణాలు ఇచ్చారు. అదే సమయంలో 2016-17లో దేశవ్యాప్తంగా 4 కోట్ల రుణాలు ఇచ్చారు. 2016-17లో రూ.1.75 లక్షల కోట్లు ఇవ్వగా, అంతకుముందు ఏడాది అంటే 2015.16లో రూ.33 వేల కోట్లు రుణాలు ఇచ్చారు.

36 శాతం మంది కొత్త ఎంటర్‌ప్రెన్యూయర్స్

ఇప్పటికే కంపెనీలు ఉండి, వారి వ్యాపారాన్ని పెంచుకునేందుకు తీసుకున్న వారే కాదు.. చాలామంది కొత్త ఎంటర్‌ప్రెన్యూయర్స్ కూడా లోన్లు తీసుకుంటున్నారు. వందలో మూడొంతుల కంటే ఎక్కువ మంది అంటే 36 శాతం మంది కొత్త ఎంటర్ ప్రెన్యూయర్స్ లోన్లు తీసుకున్నారు. దీంతో చాలామంది ఉద్యోగాల నుంచి కొత్త ఎంటర్ ప్రెన్యూయర్స్‌గా ఎదిగారు.

ప్రతి 5గురిలో నలుగురు మహిళలు

ముద్ర రుణాలలో ప్రతి ఐదుగురు మహిళలో నలుగురికి ఇవ్వబడుతుంది. ముద్ర యోజన అందరి దరి చేరింది. 90 శాతానికి పైగా లోన్లు శిషు కేటగిరీ కింద ఇవ్వబడినవి.

అట్టడుగు వర్గాలకు

ముద్ర యోజన కింద రుణ లబ్ధి పొందిన వారిలో దాదాపు సగం వరకు అట్టడుగు వర్గాలు ఉన్నాయి. 35 శాతం మంది ఓబీసీలు, 20 శాతం మంది ఓసీలు ఉన్నారు. అలాగే ఐదు శాతం మంది ట్రైబల్స్ ఉన్నారు.

స్వయం ఉపాధి లేదా వ్యాపారం ఉద్యోగాలు ఇచ్చే వారిని సృష్టిస్తుంది. గతంలో గత ప్రభుత్వాలు ఇలాంటి అవకాశాలను తమ రాజకీయ మద్దతుదారులకు ఇచ్చేవి. స్థానిక నేతల హడావుడి వీటిల్లో కనిపించేది. కానీ ముద్ర యోజనలో మాత్రం అలాంటివి ఏవీ కనిపించవు. సొంత వాళ్లకు ఇవ్వడం, రాజకీయ పక్షపాతం కనిపించదు.

ముగింపు

ద్వారా స్వయంఉఫాధి కల్పించడం, చిన్న చిన్న సంస్థలకు అండగా ఉండటం ముద్ర యోజన చేస్తుంది. స్వయం ఉపాధి ద్వారా స్థానికంగా ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించవచ్చు. అయితే ఈ పథకం లబ్ధిదారులకు సరైన పర్యవేక్షణ, మార్గదర్శకత్వం అవసరం.

(నితిన్ మెహ్రా-రన్నితి కన్సల్టింగ్ అండ్ రీసెర్ట్ మేనేజింగ్ పార్ట్‌నర్, ప్రణవ్ గుప్తా - ఇండిపెండెంట్ రీసెర్చర్)

English summary
Self Employment and Job Creation: Tracking the Progress of Mudra Yojana under Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X