వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారెంట్ జారీ: జులై 6న నిత్యానంతకు పురుషత్వ పరీక్ష

|
Google Oneindia TeluguNews

self styled godman nithyananda to undergo potency test on aug 6
బెంగళూరు/చెన్నై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు రామనాడు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిత్యానందపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఓ కేసు విషయంలో నిత్యానందకు ఈ మేరకు వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది.

ఇది ఇలా ఉండగా, ఆగస్టు 6న నిత్యానందను అదుపులోకి తీసుకుని పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు. దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు పురుషత్వ పరీక్షలపై స్టే విధించింది.

ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం నిత్యానందపై ఉన్న అన్ని కేసులను విచారించిన హైకోర్టు స్టేను ఎత్తి వేసింది. వెంటనే నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో నిత్యానంద తరఫు లాయర్ వాదిస్తూ నిత్యానంద లొంగిపోవడానికి వారం రోజుల గడువు ఇవ్వాలని, అప్పట్లోగా లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని కోర్టును కోరారు. అయితే, ఈ అప్పీల్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో, నిత్యానంద అరెస్టుకు రంగం సిద్ధమైంది.

English summary
Self-styled Godman Nithyananda to undergo potency test on Aug 6 said Karnataka Criminal Investigation Department police. High Court recently revoked stay on the order of a district court, Ramanagar directing Nithyananda, facing criminal charges including rape, to undergo a potency test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X