వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికెన్, పాలు ఒకే దగ్గర అమ్మితే మత విశ్వాసాలు దెబ్బతింటాయి : బీజేపీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

చికెన్,పాలు ఒకే దగ్గర అమ్మకూడదంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే వింత వాదన తీసుకువచ్చాడు. ఇలా ఒకే దగ్గర రెండు అమ్మడం ద్వార మత విశ్వాశాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పాల బూతులతో పాటు చికెన్ సెంటర్లను ఒకే కౌంటర్‌లో ఏర్పాటు చేయకుండా వేర్వేరు స్థలాల్లో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలోని గిరిజన సంక్షేమ విభాగం గిరిజనులను ఆర్ధికంగా పైకి తీసుకువచ్చి ఉపాధికల్పించేందుకు ఓ పథకాన్ని తీసుకువచ్చింది.
పథకంలో ముఖ్యంగా ప్రజలకు పౌష్టిక ఆహారం అందించేందుకు గాను పాలు, గుడ్లతో పాటు ప్రత్యేకంగా మధ్య ప్రదేశ్‌లో మంచి మాంసకృత్తులు లభించే కడక్‌నాథ్ అనే చికెన్ కూడ అమ్మేందుకు నిర్ణయించింది. ఇందులో భాగాంగనే పైలట్ ప్రాజెక్టుగా భోపాల్‌లోని విశాల్ నగర్‌లో ఓ షాపును ప్రారంభించింది. ఒకే దగ్గర మూడింటిని అమ్మే విధంగా ఏర్పాట్లు చేసింది.

selling chicken and milk in the same outlets hurting the religious sentiments..

అయితే దీని మత విశ్వాసాలు దెబ్బతింటాయని రామేశ్వర్ శర్మ అనే ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరాడు. అయితే బీజేపీ ఎమ్మెల్యే వాదనను స్థానిక పశుసంవర్థక శాఖ మంత్రి లఖాన్ సింగ్ స్పందించారు. ఇది గిరిజనుల ఉపాధి కోసం తీసుకువచ్చిన పథకమని చెప్పారు.

English summary
A project by Madhya Pradesh government to sell chicken and milk in the same outlet has drawn criticism from the opposition BJP which says that it's hurting the religious sentiments of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X