వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటి ప్రపంచానికి తెలియకుండా.. భార్య శవాన్ని ఇంట్లోపెట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి...!

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో వింత వింత మనుష్యులు, ఒక్కో వ్యక్తి ఓక్కోలాగా వ్యవహరిస్తాడు. ఎప్పుడు ఎందుకు ఎలా వ్యవహార శైలి ఉంటుందో సమాజానికి అర్థం కాని పరిస్థితి.. సమాజం అంతా ఓ వైపు వెళుతుంటే తాను మాత్రం ఇంకోవైపు వెళతాడు. కొంతమంది తరతరాలుగా వస్తున్నా సాంప్రదాయాలకు అనుకూలమైతే మరికొంత మంది వాటికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు.

శవాలను ఇంట్లో పెట్టుకునే వింత మనస్థత్వం

శవాలను ఇంట్లో పెట్టుకునే వింత మనస్థత్వం

ఇలాంటీ నేపథ్యంలో కోల్‌కతాలోని ఓ వ్వక్తి తన భార్య చనిపోయినా బయటకు పోక్కకుండా చేశాడు. మూడు రోజుల పాటు శవాన్ని ఇంట్లో పెట్టుకుని దుర్వాసన వస్తున్న భరించాడు. అయితే భార్యతో పాటు ఇంట్లో కూతురు కూడ ఉండడం విశేషం. ఇక గతంలో కూడ తన కూమారుడు చనిపోయినప్పుడు కూడ బయటి ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేశాడు. చివరకు శవం దుర్వాసన వస్తున్న విషయాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గమనించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

భార్య శవాన్ని ఇంట్లోపెట్టుకుని

భార్య శవాన్ని ఇంట్లోపెట్టుకుని

కోల్‌కతాలోని సర్సూవా ప్రాంతంలో రవీంద్రనాథ్ చటర్జీ అనే వ్యక్తి భార్య 82 సంవత్సరాల వయస్సులో ఆనారోగ్యంతో చనిపోయింది.అయితే భార్య చనిపోయిన విషయాన్ని రవీంధ్ర నాథ్ చౌదరీ బయటి ప్రపంచానికి తెలియకుండా ఉంచాడు. ఇక ఇంట్లోనే భార్య శవం కుళ్లి పోయేవరకు ఎవరికి తెలియలేదు. దీంతో ఇంట్లో నుండి కుళ్లిపోయిన వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులతోపాటు వెళ్లిన గ్రామస్థులు షాక్ తిన్నారు. ఇంట్లో శవాన్ని పెట్టుకుని భర్తతోపాటు ఆమే కూతురు కూడ ఉండడం చూసి అవాక్కయ్యారు.

కొడుకు శవాన్ని కూడ అలాగే...

కొడుకు శవాన్ని కూడ అలాగే...

ఇంట్లో శవాన్ని పెట్టుకుని బయటికి తెలియకుండా తలుపులు, కిటికిలు మూసివేసి బయటకు వెళ్లకుండా ఎమీ జరగనట్టే ఇంట్లోనే ఉన్నారు.ఇక ట్విస్ట్ ఏంటంటే గత ఆరు నెలల క్రితం కూడ రవీంద్రనాథ్ చటర్జీ కుమారుడు దేబాశిష్(57) కూడ చనిపోయినప్పుడు ఇలాగే ప్రవర్తించారని స్థానికులు పోలీసులకు తెలిపారు.శవాన్ని అంతిమ సంస్కారం చేయకుండా ఇంట్లోనే పెట్టుకుని కుటుంభం అంతా ఉన్నారు. ఇక బయటికి దుర్గంధం రావడంతోనే విషయం తెలిసిందని చెబుతున్నారు. మరోవైపు కుమారుడు చనిపోయిన తర్వాత చటర్జీ కుటుంభం అసలు బయటకు రావడమే మానేశారని తెలిపారు. కనీసం నిత్య అవసరాలకు కూడ బయటకు వచ్చేవారు కాదని స్థానికులు తెలిపారు.కాగ చటర్టీ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.

English summary
he family of an octogenarian woman was found living with her body for over two days, in an eerie turn of events nearly five months after the family did the same when the woman's son died in the same house in Kolkata's Behala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X