వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంలు ట్యాంపర్ చేయండి! కన్హయ్యను ఓడించండి!

|
Google Oneindia TeluguNews

ముంబై : ఎన్నికల సమయం. కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో నేతలు మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అయితే మహారాష్ట్రలో శివసేనకు చెందిన ఓ ఎంపీ మాత్రం తన నోటి దూల కారణంగా అడ్డంగా బుక్కయ్యాడు. ఈవీఎంలను ట్యాంపర్ చేయండంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నికల సంఘం నోటీసులు అందుకున్నాడు.

<strong>ఒమర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కాంగ్రెస్ స్పందించాలని మోడీ డిమాండ్</strong>ఒమర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కాంగ్రెస్ స్పందించాలని మోడీ డిమాండ్

సంజయ్‌రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు

సంజయ్‌రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు

శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీహార్‌లోని బెగుసరాయ్‌ నుంచి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ను ఓడించేందుకు అడ్డదారులు తొక్కినా పర్వాలేదని అన్నారు. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రోక్ టోక్ పేరుతో సంజయ్ ఓ వ్యాసం రాశారు. అందులో కన్హయ్యను ఓడించేదుకు ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకైనా వెనకాడవద్దని పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా పాయిజన్ బాటిల్ ఉపయోగించైనా పార్లమెంటులో అడుగుపెట్టకుండా చూడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నోటీసు జారీ చేసిన ఈసీ

నోటీసు జారీ చేసిన ఈసీ

సంజయ్‌రౌత్ కామెంట్లపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. తన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ముంబై కలెక్టర్, డిస్ట్రిక్ ఎలక్షన్ ఆఫీసర్ శివాజీ జోన్దలే నోటీసులు జారీ చేశారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈవీఎంల భద్రత, ఎన్నికల విధానంపై నమ్మకం కోల్పోయేలా ఉన్నాయని ఈసీ విమర్శించింది. సంజయ్‌రౌత్ వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.

గడువులోగా వివరణ ఇస్తానన్న సంజయ్

గడువులోగా వివరణ ఇస్తానన్న సంజయ్

ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటీసులపై సంజయ్‌రౌత్ స్పందించారు. ఈ అంశంపై ఈసీకి వివరణ ఇస్తానని స్పష్టంచేశారు. ఎలక్షన్ కమిషన్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలపై గడువులోగా సమాధానం ఇస్తానని చెప్పారు.

English summary
The district election officer of Mumbai has issued a notice to Shiv Sena MP Sanjay Raut for alleged violation of the model code of conduct over his comments against CPI candidate Kanhaiya Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X