వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

49 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మాతోనే: కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: సంజయ్ రౌత్..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ అర్దరాత్రి నిర్ణయంతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా.. ఎన్సీపీ చీలిక నేత అజిత్ పవార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇప్పుడు ఇది రాజకీయంగానే కాకుండా..న్యాయ పర వివాదంగానూ మారింది. దీని పైన శివసేన..ఎన్సీపీ..కాంగ్రెస్ కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదే సమయంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి బీజేపీ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అనే విషయం మహారాష్ట్ర ప్రజలకే తెలియదని ఎద్దేవా చేసారు. బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోవటం కోసం కొనుగోలు రాజకీయం చేస్తోందని ఆరోపిం చారు. తమ కూటమికి మెజార్టీ ఉందని..ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సంజయ్ రౌత్ స్పష్టం చేసారు.

కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది..

కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది..

శివసేన నేత ముఖ్యమంత్రిగా..ఎన్నీసీ..కాంగ్రెస్ తో కలిసి మహారాష్ట్రలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేసారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పైన ఈ మూడు పార్టీల కూటమి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీని పైన అ్యతవసర విచారణకు సుప్రీం అంగీకరించింది.

ఇదే సమయంలో రాజకీయంగా శివసేన నేతలు బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతగా అధికార దుర్వినియోగం గతంలో ఎన్నడూ చూడలేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తమ కూటమికి పూర్తి మెజార్టీ ఉందని..ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు తో పాటుగా సంఖ్యా బలం నిరూపించుకుంటామని చెప్పుకొచ్చారు. 49 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని స్పష్టం చేసారు.

బీజేపీ కొనుగోలు రాజకీయాలు చేస్తోంది..

బీజేపీ కొనుగోలు రాజకీయాలు చేస్తోంది..

మహారాష్ట్రలో బలం లేకపోయినా..అధికార దుర్వినియోగంతో బీజేపీ అధికారం చేపట్టిందని సంజయ్ రౌత్ ఆరోపించారు. రాష్ట్రపతి..గవర్నర్ కార్యాలయాలను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ విధంగా రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. శనివారం మహారాష్ట్రకు చీకటి రోజుగా అభివర్ణించారు.

అజిత్ పవార్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసి.. గవర్నర్ కు పార్టీ నుండి ఇచ్చినది గా చెబుతూ నకిలీ లేఖ అందించారని దుయ్యబట్టారు. ఇదే సమయంలో బీజేపీ కొనుగోలు రాజకీయాలకు తెర లేపిందని ఆరోపణలు చేసారు. బిజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా..కూటమి పార్టీల్లోని ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతివ్వటానికి సిద్దంగా లేరని స్పష్టం చేసారు.

ఫడ్నవీస్ ను సీఎంగా గుర్తించటం లేదు

ఫడ్నవీస్ ను సీఎంగా గుర్తించటం లేదు

మహారాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఫడ్నవీస్ ను సీఎంగా గుర్తించటం లేదని ..ఆయన ముఖ్యమంత్రి అనే విషయం రాష్ట్ర ప్రజలకే తెలియదని రౌత్ వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ యాక్సిడెంటల్ గా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఎన్సీపీ తమ ఎమ్మెల్యేలకు ఢిల్లీలో క్యాంపు ఏర్పాటు చేసి..అక్కడకు తరలించింది. అదే విధంగా శివసేన సైతం తమ పార్టీ ఎమ్మెల్యేలు చే జారకుండా జాగ్రత్త పడుతోంది. ఇక, ఇప్పుడు సుప్రీం కోర్టులో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం పైన దాఖలైన అత్యవసర పిటీషన్ పైన బెంచ్ విచారణ ప్రారంభించనుంది. దీంతో..ఇప్పడు కేంద్రంతో పాటుగా ఆ మూడు పార్టీలు..సాధారణ ప్రజలు సుప్రీం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

English summary
Shivasena MP Sanjay Rowth says 49 NCP MLA's with them. He saying that BJP misused power to form govt in Maharastra. Rowth confident on forming govt with full majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X