• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టాప్ అడ్వొకేట్ హరీష్ సాల్వే రెండో పెళ్లి: 65 ఏళ్ల వయస్సు: 18 ఏళ్ల కుమార్తె తల్లితో: లండన్‌లో

|

న్యూఢిల్లీ: సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హైప్రొఫైల్ కేసులను మాత్రమే వాదించే ఖరీదైన న్యాయవాదిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నారు. 65 సంవత్సరాల వయస్సులో ఆయన రెండో పెళ్లికి సిద్ధపడుతున్నారు. ఇదివరకు హరీష్ సాల్వే సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు. సొలిసిటర్ జనరల్‌గా పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన లండన్‌లో నివసిస్తున్నారు. లండన్, వేల్స్‌లో క్వీన్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. క్వీన్స్ కౌన్సిల్‌కు ఎంపిక కావడం.. అసాధారణంగా భావిస్తుంటారు.

నవరాత్రుల్లో నరబలి: అమ్మోరికి భార్యను బలి ఇచ్చిన కిరాతకుడు: రోజుల కఠోర ఉపవాసం: అవయవాలతో

 బాప్టిజాన్ని స్వీకరించిన హరీష్ సాల్వే..

బాప్టిజాన్ని స్వీకరించిన హరీష్ సాల్వే..

మరాఠీ కుటుంబానికి చెందిన హరీష్ సాల్వే ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. తన భార్య మీనాక్షి సాల్వేకు ఈ ఏడాది జూన్‌లో విడాకులు ఇచ్చారు. చట్టపరంగా విడిపోయారు. 1982లో ఆయన మీనాక్షిని వివాహం చేసుకున్నారు. సాల్వే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 38 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. అదే సమయంలో- లండన్‌కు చెందిన ప్రముఖ కళాకారిణి కరోలిన్ బ్రొస్సార్డ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. బుధవారం లండన్‌లోని ఓ చర్చిలో ఈ పెళ్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాను బాప్టిజాన్ని స్వీకరించానని, బాప్టిస్ట్ క్రైస్తవుడినని హరీష్ సాల్వే ఇదివరకు వెల్లడించారు.

56 సంవత్సరాల కళాకారిణితో వివాహం..

56 సంవత్సరాల కళాకారిణితో వివాహం..

లండన్‌కు చెందిన ఓ కళాకారిణిని హరీష్ సాల్వే వివాహం చేసుకోనున్నారు. ఆమె పేరు కరోలిన్ బ్రొస్సార్డ్. వయస్సు 56 సంవత్సరాలు. ఆమెకు ఇదివరకే వివాహమైంది. 18 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఆమె కూడా డైవొర్సీ కావడంతో హరీష్ సాల్వేతో వివాహానికి అంగీకరించారు. ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్భంగా కరోలీన్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయమే వివాహానికి దారి తీసిందని హరీష్ సాల్వే తెలిపారు. తాను బాప్టిజాన్ని స్వీకరించినందున తన రెండో వివాహాన్ని చర్చిలో నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండేళ్లుగా తాను చర్చిలో ప్రార్థనలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అన్నీ హైప్రొఫైల్ కేసులే..

అన్నీ హైప్రొఫైల్ కేసులే..

హరీష్ సాల్వే వాదించే కేసులన్నీ హైప్రొఫైల్‌కు చెందినవే. పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులను ఆయన అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించారు. దీనికోసం ఒక రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. వొడాఫోన్, పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, రతన్ టాటా గ్రూప్ సంస్థలకు హరీష్ సాల్వే శాశ్వత న్యాయవాదిగా ఉంటున్నారు. ఐటీసీ హోటల్స్ సంస్థ కేసులను ఆయనే వాదిస్తారు. ప్రస్తుతం టీఆర్పీ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి కేసును హరీష్ సాల్వే వాదిస్తున్నారు.

నాగ్‌పూర్‌లో

నాగ్‌పూర్‌లో

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 1955 జూన్ 22వ తేదీన హరీష్ సాల్వే జన్మించారు. ఆయన తండ్రి నరేంద్ర కుమార్ సాల్వే ఛార్టెడ్ అకౌంటెంట్. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసేవారు. తల్లి అమృితి సాల్వే డాక్టర్. నాగ్‌పూర్ యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్‌బీలో డిగ్రీ పూర్తి చేశారు. 1992లో ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వొకేట్‌గా డిజిగ్నేట్ అయ్యారు. 1999-2002 మధ్యకాలంలో సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. బుధవారం లండన్ చర్చిలో జరిగే తన రెండో వివాహానికి అతికొద్దిమందిని మాత్రమే ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

English summary
Senior advocate Harish Salve, who recently divorced his first wife, has announced the second marriage with a London-based artiste next week. The 65-year-old lawyer divorced his wife for 38 years Meenakshi Salve in June this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X