వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ఇక లేరు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sushma Swaraj: Senior BJP Leader And Former Foreign Minister Sushma Swaraj Passed Away!!

బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం రాత్రి హఠాన్మరణం పోందారు. గుండెనోప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమేను హూటిహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పోందుతూ మృతి చెందింది. దీంతో పార్టీ సీనియర్ నేతలు హుటాహుటిన ఆసుపత్రికి తరలి వెళ్లారు. సుష్మాస్వరాజ్ వయస్సు వయస్సు 67 సంవత్సరాలు

పార్లమెంట్‌లో జమ్ము కశ్మీర్ పునర్విభజనపై ప్రవేశ పెట్టిన బిల్లు పాస్ కావడంతో ప్రధాని మోడీని అభినందిస్తూ సాయంత్రం 7.30 నిమిషాలకు ఆమే చివరి ట్వీట్ చేశారు. ఇందు కోసమే తాను చాల రోజులుగా వేచి చూస్తున్నానని తెలిపారు. కాగ ఆనారోగ్య కారణాలతోనే ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ ఎన్నికల్లో పోటి చేయలేదు. గత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆమే భాద్యతలు చేపట్టారు. .

Senior BJP leader Sushma Swaraj passed away

సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో బీజేపీ శ్రేణులన్నీ విషాదంలో మునిగిపోయాయి.సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 13న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో ఆమె కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఎయిమ్స్ నుండి ఆమే బౌతిక కాయాన్ని ఇంటికి తరలించారు. ప్రజల సందర్శనార్థం 12 గంటల వరకు ఇంటివద్ద ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమే బౌతిక కాయాన్ని ఉంచనున్నట్టు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా తెలిపారు. ఆ తర్వాత లోదీ రోడ్డు లోని స్మశాన వాటికలో ఆమే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

English summary
Senior BJP leader and former foreign minister Sushma Swaraj passed away a while ago at AIIMS on Tuesday. The BJP veteran, who suffered a massive heart attack, died at the age of 67.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X