వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నువ్వే అధ్యక్షుడంటూ రాహుల్ ఇంటికి సీనియర్ నేతల క్యూ... రాహుల్ లేకుండా ఉండలేమంటూ నేతల రాజీనామా...

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కోంటుంది..సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవి రాహుల్ గాంధీ రాజీనామ చేశాడు..దీంతో తిరిగి ఆపదవి చేపట్టేందుకు నిరాకరిస్తుండడతో పలువురు పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ భవితవ్యంపై నిరాశ చెందుతున్న నేతలు ఒక్కోక్కరు పార్టీని వీడుతున్నారు..తాజగా ఏఐసీసీ లీగల్ సెల్ చైర్ పర్సన్ వివేక్ టంకా తోపాటు పలువరు నేతలు తమ పదవులు రాజీనామ చేశారు..ఇక ఇదే బాటలో మరింత మంది నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది.

రాహుల్ పై ఒత్తిడికి కాంగ్రెస్ ర్యాలీ

రాహుల్ పై ఒత్తిడికి కాంగ్రెస్ ర్యాలీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు మొండికేస్తున్న రాహుల్ గాంధిపై ఒత్తిడి పెరుగుతుంది.. ఓవైపు రాహాుల్ గాంధి లేకుండా తాము కూడ ఉండలేమంటూ పలు రాష్ట్రాల నేతలు రాజీనామ పట్టిన విషయం తెలిసిందే...ఈనేపథ్యంలోనే పలువురు నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.మరోవైపు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ పలువురు యువజన నాయకులు ఆందోళనలను నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ కార్యాలయం నుండి రాహుల్ గాంధీ ఇంటి వరకు ర్యాలీలు చేపట్టనున్నారు.

నేడు మరోసారి రాహుల్ ఇంటికి సీనియర్ నేతలు

నేడు మరోసారి రాహుల్ ఇంటికి సీనియర్ నేతలు


తాజా రాజీకీయ పరిమాణాలపై చర్చించడంతోపాటు, పార్టీ అధ్యక్షుడి ఎంపిక, పలు రాజకీయ అంశాలపై చర్చించేందుకు గాను రెండు రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.. ఈ సమావేశంలో కూడ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ పార్టీ నేతలు కోరారు.. అయితే వారి విన్నపాన్ని రాహుల్ గాంధి తిరస్కరించినట్టు తెలుస్తోంది...పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తీసుకున్న నిర్ణయం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు..

త్వరలో సీడబ్ల్యుసీ.. సమావేశం...

త్వరలో సీడబ్ల్యుసీ.. సమావేశం...


దీంతో మరోసారి పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేతలైన పీసీ చాకో, షీలా దీక్షిత్‌, కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌, జేపీ అగర్వాల్‌, మహాబల్‌ మిశ్రా, అర్విందర్ లవ్లీ తదితరులు నేడు మరోసారి రాహుల్‌ నివాసానికి వెళ్లారు. రాజీనామా అంశంపై ఆయనతో చర్చించారు.పార్టీ నేత ఎంపిక పై చర్చించేందుకు త్వరలో అత్యున్నత స్థాయి కమిటీ అయిన
సీడబ్ల్యుసీ సమావేశం కానుంది...దీంతో రాహుల్ నిర్ణయం పై మరోసారి చర్చించనున్నారు.. అప్పుడు కూడ రాహుల్ గాంధీ రాజీనామకు కట్టుబడి ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి.

English summary
the Congress’s troubles, which began with a humiliating defeat in the Lok Sabha elections and the subsequent refusal by sulking party chief Rahul Gandhi to continue in his post, seem to be far from over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X