వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం ... టిక్ టాక్ యాప్ నిషేధం... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Tamil Nadu Government Took A Sensational Decision On Tik Tok App | Oneindia Telugu

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ ను బ్లూవేల్ యాప్ తో పోలుస్తూ తమిళనాడు మంత్రి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న యాప్ గా అసెంబ్లీ వేదికగా అభివర్ణించారు. దేశం మొత్తం ఆడియోలు, వీడియోలతో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ఏ మాత్రం శ్రేయస్కరం కాదని తమిళనాడు అసెంబ్లీలో దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఈ యాప్ ను బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు ఐ టి మినిస్టర్ ఎం మణికందన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు.

దేశంలో మంచి క్రేజ్ సంపాదించిన యాప్ .. దుర్వినియోగం

దేశంలో మంచి క్రేజ్ సంపాదించిన యాప్ .. దుర్వినియోగం

టిక్ టాక్ యాప్ ఈమధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో డబ్‌స్మాష్‌ కూడా ఈ తరహా యాప్ అయినప్పటికీ టిక్ టాక్ వచ్చిన తర్వాత యువత దీనికి బాగా అలవాటుపడ్డారు. తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో టిక్ టాక్ యాప్ చాలా సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. ఇటీవల కాలంలో ఒక కలెక్టర్ కు సంబంధించిన ఫోటోలను ఆమె అనుమతి లేకుండా టిక్ టాక్ లో వీడియో గా తయారు చేసి పోస్ట్ చేసి దానిని వైరల్ చేసారు .తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ రోహిణి పర్సనల్ ఫోటోలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సినిమా పాటలతో యాడ్ చేసి టిక్ టాక్ యాప్ లో పోస్టు చేశారు. ఆమెతోపాటు ఆమె కుమారుడి ఫోటోలను కూడా వివిధ రకాల సోషల్ మీడియా నెట్ వర్క్ లలో షేర్ చేశారు.ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ రోహిణి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిణి ఫోటోలతో ఉన్న టిక్‌టాక్‌ మ్యూజిక్‌ను నిషేధించే పనిలో సైబర్‌క్రైం పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రతి చోట ఇలాంటి తలనొప్పులు ఎదురవుతున్నప్పటికీ ఈ యాప్ విషయంలో ఏ రాష్ట్రము ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు .

తమిళనాడు ప్రభుత్వ సంచలనం .. టిక్ టాక్ యాప్ నిషేధం

తమిళనాడు ప్రభుత్వ సంచలనం .. టిక్ టాక్ యాప్ నిషేధం

టిక్ టాక్ తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాగపట్టిణం ఎమ్మెల్యే తమీమున్ హన్సారీ.. టిక్ టాక్ యాప్‌ను తక్షణమే రాష్ట్రంలో నిషేధించాలని కోరారు. చాలా పాఠశాలల్లో, కళాశాలలో విద్యార్థులు టిక్ టాక్ యాప్ ను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

అశ్లీల చిత్రాలు, పలు వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయన్నారు. అందువల్ల ఈ యాప్‌ను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి మణికంఠన్ సమాధానం ఇచ్చారు.. టిక్ టాక్ యాప్‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని, దీనిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.

ఆసియాలో పాపులర్ యాప్ ... 500 మిలియన్ల వినియోగదారులు

ఆసియాలో పాపులర్ యాప్ ... 500 మిలియన్ల వినియోగదారులు

బైట్ డాన్స్ అనే చైనీస్ ఐటీ కంపెనీ తయారుచేసిన ఈ యాప్ చాలా పాపులారిటీ సంపాదించింది. ఆసియా లో 500 మిలియన్ల వినియోగదారులు ఈ యాప్ కు ఉన్నారు. ఈ యాప్ ద్వారా సినిమాలకు సంబంధించిన పాటలు, సీన్లు, డైలాగులు వినియోగదారులు అందులో ఉన్న వివిధ ఫిల్టర్ల ద్వారా రికార్డ్ చేస్తూ పబ్లిక్ కి షేర్ చేస్తున్నారు. యువత ఈ యాప్ పట్ల చాలా క్రేజ్ తో ఉంది.

ప్రమాదకరమైన బ్లూవేల్ గేమ్ తో పోల్చటం పై నిపుణుల అభిప్రాయం

ప్రమాదకరమైన బ్లూవేల్ గేమ్ తో పోల్చటం పై నిపుణుల అభిప్రాయం

దీనికి సంబంధించి ఇది ప్రమాదకరమైన యాప్ గా అభివర్ణిస్తూ బ్లూవేల్ తరహాలో దీనిని కూడా నిషేధించాలని కేంద్రానికి లేఖ రాయనున్నారు. అయితే దీనిపై నిపుణులు బ్లూవేల్ ఒక ఆట అని, అది ఒక యాప్ కాదని, అది వ్యక్తిగతంగా ఒక్కరు మాత్రమే ఆడుకునే ఆట అని చెప్పారు . 2017 లో భారత ప్రభుత్వం బ్లూవేల్ గేమ్ ను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ గేమ్ ఛాలెంజ్ ముఖ్యంగా యువతను రకరకాల టాస్క్ లతో మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్య చేసుకునే దిశగా ప్రేరేపిస్తుంది కాబట్టి, ఈ గేమ్ ను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టిక్ టాక్ యాప్ ను బ్లూవేల్ చాలెంజ్ తో పోల్చడం సరికాదు అనే అభిప్రాయం సైతం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక టిక్ టాక్ యాప్ విషయానికి వస్తే చిన్న చిన్న వీడియోలతో, సినీ డైలాగులతో అందులో ఉన్న మాటలకు, పాటలకు అనుగుణంగా పెదవులను కదిలిస్తూ తమలో ఉన్న టాలెంట్ ను లోకానికి తెలియజేసే యాప్ మాత్రమే అని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

తమిళనాడు బ్యాన్ చేసింది అందుకే

తమిళనాడు బ్యాన్ చేసింది అందుకే

ఏది ఏమైనా తమిళనాడు ప్రభుత్వం టిక్ టాక్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు రాజకీయ నాయకులను ట్రోల్ చేయడానికి ఈ యాప్ ఉపయోగిస్తున్నట్లు గా తెలుస్తోంది. అందుకే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టిక్ టాక్ యాప్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో పొలిటీషియన్ లను టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తూ, వారికి సంబంధింఛి నెగిటివ్ ప్రచారం టిక్ టాక్ యాప్ వేదికగా జరుగుతున్న నేపధ్యంలో విసిగిపోయిన రాజకీయ నేతలు టిక్ టాక్ ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే టిక్ టాక్ పై నిషేధం ఎప్పటి నుండి అమలులోకి రానుందో మాత్రం ఇంకా ప్రకటించలేదు.

English summary
Tamil Nadu government took a sensational decision on tik tok app. people of Tamil Nadu may not get to use one of their popular app- TikTok. A discussion regarding the lip-sync app took place in the Tamil Nadu legislative assembly. the MLA'S and Ministers decided to ban the app because of law and order problems with the app . Information Technology minister M Manikandan, said that the government of Tamil Nadu will recommend the central government to ban the app, just like how it took steps when people were worried about the Blue Whale challenge. However, no information regarding a possible timeline was given by the minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X