వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాక్ మార్కెట్: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగింపు, జోష్‌లో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో బాగా కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్ల మేర లాభపడగా... నిఫ్టీ 10,550 పైకి ఎగిసింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల ర్యాలీలో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది.

సింగపూర్‌ స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ ఫ్యూచర్స్‌ నుంచి బలమైన సంకేతాలు రావడంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు కూడా బలపడ్డాయి. గత ఏడురోజులుగా మదుపరులు చవిచూసిన నష్టాలకు గురువారం బ్రేక్ పడింది.

Sensex ends 330 pts higher, Nifty above 10,550; IT, pharma, realty gain

ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మినహా హెల్త్ కేర్, ఐటీ, రియాల్టీ, ఫార్మా, బ్యాంకింగ్ తదితర సూచీలన్నీ గ్రీన్ లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 34,413కు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 10,577 వద్ద క్లోజ్ అయింది.

గురువారం దాదాపు అన్ని సెక్టార్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. దీంతో సెన్సెక్స్ రోజంతా భారీ లాభాలతో కదలాడింది. ఫార్మా రంగం టాప్‌ విన్నర్‌గా ఉండగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ , మెటల్‌, ఐటీ, ఆటో రంగాల​ షేర్లు లాభపడ్డాయి.

ప్రధానంగా సన్ ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ఇండెక్స్ హెవీవెయిట్స్‌ బాగా లాభపడ్డాయి. సిప్లా, అంబుజా, ఇన్‌ఫ్రాటెల్‌, ఐబీ హౌసింగ్‌, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ లాభాల్లో ముగియగా.. అరబిందో, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, టాటా మోటర్స్‌, హిందాల్కో నష్టాల్లో ముగిశాయి.

English summary
The indices ended higher on Thursday after the market heavy weights such as Infosys gained over 2%. The S&P BSE Sensex gained over 500 points to 34634 levels before trimming gains. In broader markets, Nifty50 index hit an intra-day high of 10,637 levels. The S&P BSE Sensex ended at 34,413, up nearly 330 points while the broader Nifty50 index settled at 10,576, up around 100 points. Among other index stocks, Sun Pharma, Dr. Reddy's, State Bank of India, Axis Bank and HDFC gained between 1.5% to 6.1%. Shares of Cipla surged as much as 6.85% after the country’s fourth-largest drugmaker by revenue reported a 7% jump in quarterly profit on Wednesday. The day's gains came even as Asian shares flirted with six-week lows. MSCI’s broadest index of Asia-Pacific shares outside Japan was little changed as U.S. bond yields crept up towards four-year highs. Among regional indices, Nikkei 225, Straits Times, KOSPI and Hang Seng moved up between 0.4% to 1.2%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X