రికార్డులు నమోదు: తొలిసారి 35వేలు దాటిన సెన్సెక్స్, లాభాల్లోనే నిఫ్టీ

ముంబై: బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) సెన్సెక్స్‌ అరుదైన మైలురాయిని తాకింది. మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా 35వేల మార్క్‌ను దాటింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఈ రికార్డు నమోదవడం గమనార్హం.

ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్ల అండతో బుధవారం లాభాల్లో పరుగులు తీసిన సూచీలు సంచలనాల దిశగా సాగాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఉన్న సూచీలు మధ్యాహ్నం సమయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ మార్కెట్‌ అంచనాలను పెంచాయి.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 255 పాయింట్ల లాభంతో 35,026 వద్ద, నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో 10,771 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

Sensex hits 35,000 for the first time

ఇటీవల వెలువడిన ఐటీ కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలతో పాటు గురువారం జరగబోయే జీఎస్‌టీ సమావేశంపై ఆశాజనకంగా ఉన్న మదుపర్లు పెట్టుబడుల బాట పట్టినట్లు మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+