వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకకు ప్రత్యేక జెండా: డిజైన్ పూర్తి, చట్టంలో అవకాశం ఉంటుందా, లేదా, చర్చ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఎలా ఉండాలి అనే విషయంపై ఏర్పాటు అయిన ప్రత్యేక కమిటీ అధ్యయనం పూర్తి చేసి ఓ నిర్ణయానికి వచ్చింది. త్వరలో ప్రభుత్వానికి నివేదికతో పాటు కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఎలా ఉండాలి అనే విషయంపై తమ నిర్ణయాన్ని, డిజైన్ ను సమర్పించనుంది.

ప్రత్యేక కమిటీ

ప్రత్యేక కమిటీ

కర్ణాటకకు ప్రత్యేక జెండా ఏర్పాటు చేసే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ నెలలో 9 మందితో ఓ ప్రత్యేక కమిటీ వేసింది. కన్నడ, సంసృతిక శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు అయిన ప్రత్యేక కమిటీ ఇప్పటికే రాష్ట్ర జెండా ఎలా ఉండాలి అనే విషయంపై పలు సార్లు చర్చించారు.

పసుపు, ఎరుపు రంగులు

పసుపు, ఎరుపు రంగులు

కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఎలా ఉండాలి అని తుదిమెరుగులు రుద్ది ఒక డిజైన్ పూర్తి చేశారు. ఇప్పటికే కర్ణాటకకు పసుపు, ఎరుపు రంగుల్లో ఓ జెండా ఉంది. పసుపు, ఎరుపు రంగుల జెండాకు కొన్ని మార్పులు చేసి అధికారికంగా ప్రభుత్వం జెండాను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.

చట్టంలో అవకాశం ?

చట్టంలో అవకాశం ?

కర్ణాటకకు అధికారికంగా ఓ జెండా ఉండాలని, అందుకు నిపుణులతో ఓ కమిటీ వేసి తుది నిర్ణయం తీసుకుంటామని సిద్దరామయ్య ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. అయితే రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం చట్టంలో లేదని పలువురు వాదిస్తున్నారు.

కర్ణాటక ప్రభుత్వం !

కర్ణాటక ప్రభుత్వం !

కర్ణాటక ప్రభుత్వానికి అధికారికంగా ఓ జెండా ఉండాలని సిద్దరామయ్య ప్రభుత్వం వాదిస్తోంది. మొత్తం మీద కర్ణాటక ప్రభుత్వానికి ఓ ప్రత్యేక జెండా ఉండాలా ? లేదా ? అనే విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం జరుగుతోంది.

English summary
9 members committee headed by Principal Secretary Department of Kannada and Culture finalized design for separate flag for Karnataka and submit a report to the government soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X