వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా పర్యటనలో వెనక్కి తగ్గిన కశ్మీర్ వేర్పాటు వాదులు...! బంద్‌కు పిలుపునివ్వని నేతలు

|
Google Oneindia TeluguNews

కశ్మీర్ ప్రత్యేక వాదులు ముప్పై సంవత్సరాల తర్వాత మొదటి సారి వెనక్కి తగ్గారు... కేంద్రహోంమంత్రి హోదాలో కశ్మీర్‌‌కు వెళ్లిన అమిత్ షా పర్యటనలో ముప్పయి సంవత్పరాల తర్వాత ప్రత్యేక వాదులు కశ్మీర్ వ్యాలీలో బంద్‌కు పిలుపునివ్వలేదు..దీంతో అమిత్ షా కశ్మీర్ పర్యటన ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా గవర్నర్ సత్యపాల్‌తో కలిసి అభివృద్దితో పాటు భద్రతా వ్యవహారాలపై చర్చించన్నారు.

మొదటి సారి వెనక్కి తగ్గిన కశ్మీర్ వేర్పాటు వాదులు

మొదటి సారి వెనక్కి తగ్గిన కశ్మీర్ వేర్పాటు వాదులు

కేంద్రంలో తిరుగులేని మెజారీటితో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వంతో కశ్మీర్ ప్రత్యేక వాదుల్లో మార్పు కనిపిస్తుంది..కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఎర్పడడంతోపాటు ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడ బీజేపీ ప్రత్యేక ప్రభావం ఉన్న లఢక్ లాంటీ ప్రాంతాల్లో కూడ విజయకేతనం ఎగురవేసింది..దీంతో కశ్మీర్‌లో ఉన్న ఆరు పార్లమెంట్ స్థానాలకు గాను మూడు స్థానాలకు బీజేపీ కైవసం చేసుకుంది.దీంతో కశ్మీర్ పార్టీలతోపాటు ప్రత్యేక వాదాన్ని వినిపించే వర్గాల్లో మార్పు కనిపిస్తోంది...

కేంద్ర ప్రతినిధుల పర్యటిస్తే చాలు కశ్మీర్‌ బంద్‌కు పిలుపు..

కేంద్ర ప్రతినిధుల పర్యటిస్తే చాలు కశ్మీర్‌ బంద్‌కు పిలుపు..

సాధరణంగా కశ్మీర్ వ్యాలిలో ప్రధానమంత్రుల స్థాయి నుండి కేంద్రమంత్రులు పర్యటించిన సంధార్భాల్లో ప్రత్యేక వాదులు కశ్మీర్ బంద్‌కు పిలుపునిస్తారు..ఈనేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ కశ్మీర్‌లో ప్రచారం నిర్వహించిన ఫిబ్రవరీ 3తోపాటు గత సంవత్సరం సెప్టెంబర్ 10న అప్పటి హోంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో కూడ ప్రత్యేక వాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. కాని కేంద్ర హోంమంత్రి హోదాలో మొదటి సారి కశ్మీర్ పర్యటనకు వెళ్లిన అమిత్ షా పర్యటనలో ప్రత్యేక వాదులు ఎలాంటీ ఇబ్బందులు కల్గించకుండా ప్రశాంతంగా ఉన్నారు..

హురియత్‌తోపాటు ఇతర సంస్థలు సైలన్స్..

హురియత్‌తోపాటు ఇతర సంస్థలు సైలన్స్..


ఈనేపథ్యంలోనే ప్రత్యేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించే హురియత్ కాన్ఫరెన్స్ పార్టీ నేత గిలాని ,మిర్వాజ్ ఉమర్ ఫారూక్ తోపాటు యాసిన్ మాలిక్‌లు సైతం ఎలాంటీ బంద్‌కు పిలుపు ఇవ్వలేదు. వీరే కాకుండా స్థానికంగా ఉండే ఏ గ్రూపు కూడ బంద్‌కు పిలుపునివ్వకుండా సైలంట్‌గా ఉన్నారు. దీంతో కశ్మీర్ వ్యాలీలో ఎలాంటీ ఆందోళనలు,బంద్‌లతోపాటు హింసకు తావు లేకుండా అమిత్ షా పర్యటన కొనసాగుతోంది.

కశ్మీర్‌లో కొనసాగుతున్న అమిత్ షా పర్యటన

కశ్మీర్‌లో కొనసాగుతున్న అమిత్ షా పర్యటన


ఇక పర్యటనలో భాగంగా ఈనెల 30 నుండి కొనసాగనున్న అమర్‌నాథ్ యాత్ర పై సెక్యూరిటి పై నిర్వహించనున్న సమావేశంలో పాల్గోన్నారు..యాత్రలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు.... మరోవైపు రాష్ట్ర్ర అభివృద్ది, భద్రతా చర్యలపై గవర్నర్ సత్యపాల్‌తో సమావేశం కానున్నారు..మరోవైపు టెర్రరిస్టుల దాడుల్లో మృతి చెందిన భాదిత కుటుంభాలను ఆయన పరామర్శించారు..అనంతరం వారికి ఎక్స్‌గ్రేషియా క్రింద పలువురి చెక్కులను అందించారు.

English summary
For the first time in three decades of terrorism in Kashmir separatist groups refrained from giving calls for a shutdown on the visit of Union home minister to the Valley
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X