వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో మోడీ, సపరేట్ సెగ, ముషారఫ్ ఘాటు వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్/ఇస్లామాబాద్: వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్ము కాశ్మీర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.745 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. గృహాల పునర్ నిర్మాణం, ఆరు ప్రధాన ఆసుపత్రులలో సౌసర్యాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించిన సందర్భంగా మోడీ ఈ మేరకు ప్రకటించారు. దీపావళి పర్వదినం నాడు జమ్ముకాశ్మీర్‌లో ఉంటానని చెప్పిన మోడీ.. పండుగ నాడు రాష్ట్రానికి వచ్చారు.

మోడీకి కాల్పులతో స్వాగతం

మోడీ గురువారం ఉదయం సియాచిన్ వద్ద భారత జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకునేందుకు వచ్చేకంటే ముందు.. సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. రామ్‌గఢ్ సెక్టార్‌లో భారత్ శిబిరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు.

ప్రత్యేకవాదుల ఆందోళన

నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో ప్రత్యేకవాదులు బందుకు పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు పలుచోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీనగర్‌లో బస్సులను బందు చేశారు. దీంతో ప్రజలు ప్రయివేటు బస్సులు, ఆటో రిక్షాలలో ప్రయాణించారు.

పాక్‌కు, ముస్లీంలకు మోడీ వ్యతిరేకం: ముషారఫ్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన పాకిస్తాన్ మాజీ అధ్యక్షులు పర్వేజ్ ముషారఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాంతి ప్రక్యి పైన ఆయన తమ దేశాన్ని శాసించలేరన్నారు. మోడీ పాకిస్తాన్, ముస్లీం వ్యతిరేకి అన్నారు. పాక్ ప్రజలు లేదా విదేశాంగ కార్యదర్శి హురియత్ నాయకులను కలవకూడదన్న మోడీ ప్రభుత్వ ఆంక్షలు తమకు వర్తించదని ముషారఫ్ భారత్‌కు చెందిన ఓ చానల్‌తో అన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు తొలిసారిగా జమ్ము కాశ్మీర్‌లోని సియాచిన్‌లో పర్యటించి సైనికులతో ఉత్సాహంగా గడిపారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

దీపావళి సంబరాలను ఆయన జమ్ము కాశ్మీర్ ప్రజలతో చేసుకొన్నారు. గత పదేళ్లలో సియాచిన్‌లో పర్యటించిన తొలి ప్రధాని నరేంద్ర మోడీ.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో దేశంకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ విధులను నిర్వహిస్తున్న సైనికులను ఆయన ఆప్యాయంగా పలకరించి మిఠాయిలు పంచిపెట్టారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

తొలి దీపావళి సంబరాలను సైనికుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

దీపావళి పర్వదినం నాడు నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మోడీ దీపావళి రోజు తొలుత సియాచిన్ వచ్చారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మధ్యాహ్నం వరకు అక్కడ సైనికులతో గడిపారు. గత పదేళ్లలో సియాచిన్ ప్రాంతాన్ని సందర్శించిన తొలి ప్రధాని మోడీనే. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా మోడీతో పాటు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఉదయం నుండి ప్రధాని తన పర్యటన విషయాలు పలుమార్లు ట్వీట్ చేశారు. సియాచిన్ హిమనీనదానికి వెళ్తున్నానని, ఎంతో ముఖ్యమైన దీపావళి రోజున సైనికులతో గడపడం తన అదృష్టమని ప్రధాని పేర్కొన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు భద్రంగా ఉన్నారంటే జవాన్ల మొక్కవోని దైర్యమన్నారు. సైనికులను ప్రధాని ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశారు. వారికి మిఠాయిలు పంచారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రధాని మోడీలు పరస్పరం ప్రశంసలు కురిపించారు. వరదల సమయంలో బాగా స్పందించారని పేర్కొన్నారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు తొలిసారిగా జమ్ము కాశ్మీర్‌లోని సియాచిన్‌లో పర్యటించి సైనికులతో ఉత్సాహంగా గడిపారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

దీపావళి సంబరాలను ఆయన జమ్ము కాశ్మీర్ ప్రజలతో చేసుకొన్నారు. గత పదేళ్లలో సియాచిన్‌లో పర్యటించిన తొలి ప్రధాని నరేంద్ర మోడీ.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో దేశంకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ విధులను నిర్వహిస్తున్న సైనికులను ఆయన ఆప్యాయంగా పలకరించి మిఠాయిలు పంచిపెట్టారు.

26న ఎన్డీయే ఎంపీలకు ప్రధాని తేనీటి విందు

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఘన విజయంతో ఉత్సాహంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలకు అక్టోబర్‌ 26న తేనీటి విందును ఇవ్వనున్నారు. ప్రధాని నివాసంలో జరిగే ఈ విందుకు శివసేన ఎంపీ, కేంద్ర మంతి అనంత్‌ గీతే కూడా హాజరు కానున్నారు. తేనీటి విందు విషయాన్ని గీతేనే వెల్లడించడం విశేషం. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్డీయే ఎంపీలతో భేటీ అవ్వడం ఇదే తొలిసారి.

‘‘ఎన్డీయే ఎంపీలందరినీ ప్రధాని టీకి ఆహ్వానించారు. అక్టోబర్‌ 26న ప్రధాని నివాసంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఎన్డీయేలో శివసేన కూ డా భాగం కనుక.. నాతో సహా శివసేన ఎంపీలందరూ హాజరవుతారు'' అని అనంతం గీతే ప్రకటించారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీతో శివసేన మళ్లీ సంబంధాలను పునరుద్ధరించుకుంటుందా అనే విషయంపై గీతే స్పందించకపోయినా ఎన్డీయేలో శివసేన భాగమని చెప్పడం గమనార్హం.

ఐక్యతా పరుగులో మోడీ

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ఐక్యతా పరుగులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ పరుగు ఈ నెల 31వ తేదీన జరగనుంది.

నవంబర్ 2న మోడీ రేడియో కార్యక్రమం

నరేంద్ర మోడీ మన్ కీ బాత్ రెండో విడత రేడియో కార్యక్రమం నవంబరు రెండో తేదీన ప్రసారం కానుంది. సుపరిపాలనకు సంబంధించి ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలను పంచుకునే వేదికగా ఈ రేడియో కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. నవంబర్ రెండో తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే ఈ రెండో విడత కార్యక్రమం కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.

English summary
A shutdown called by separatists affected life here and in the Kashmir Valley Thursday as Prime Minister Narendra Modi flew into Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X