వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పండుగ రోజుల్లో బ్యాంకులకు వారం రోజుల సెలవులు, నగదు కొరత?

బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. అసలే పండుగ రోజులు. పండుగల్లో తమ అవసరాలను తీర్చుకొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Banks have serial holidays బ్యాంకులకు వారం సెలవులు, నగదు కొరత? | Oneindia Telugu

కోల్‌కతా: బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. అసలే పండుగ రోజులు. పండుగల్లో తమ అవసరాలను తీర్చుకొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. బ్యాంకులకు సెలవులు రాకముందే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నెల 30వ, తేదిన దసరా పర్వదినం. ఆ రోజు శనివారం. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని బ్యాంకులకు సెలవు. దసరా మరునాడు ఆదివారం. బ్యాంకులకు వారాంతపు సెలవు దినం.

Serial holidays banks from sept 29 to oct 12

సోమవారం నాడు అక్టోబర్ రెండవ తేదిన బ్యాంకులకు సెలవు. దీంతో శుక్రవారం నుండి సోమవారం వరకు బ్యాంకుల వరుసగా సెలవులు రానున్నాయి.పండుగల కారణంగా నగదు కోసం ఎటిఎంల చుట్టూ తిరగనున్నారు ఖాతాదారులు.

అయితే ఎటిఎంలలో కూడ నగదు కొరత ఏర్పడే అవకాశం లేకపోలేదు. వరుస సెలవుల కారణంగా ఎటిఎంలలో కూడ నగదును పెట్టే సిబ్బంది అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. మరో వైపు అక్టోబర్ 6, 12 తేదిల్లో కూడ బ్యాంకులకు సెలవులు .

సెప్టెంబర్ 29వ, తేది నుండి అక్టోబర్ 12 వరకు సుమారు వారం రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. పండుగ వేళ, నెలాఖరు కారణంగా నగదు కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడే అవకాశం లేకపోలేదు.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులకు నగదు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నామని ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి అధికారులు ప్రకటించారు.

English summary
Serial holidays banks from sept 29 to oct 12. Bank officers said that set to alternative arrangements for currency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X