• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్రికెట్ లో సెంచరీ చేసినట్లు 100 హత్యలు చేసిన డాక్టర్, శవాలను మొసళ్లకు వేశాను, ఏం చేస్తారో చేసుకోండి

|

న్యూఢిల్లీ/ లక్నో: క్రికెట్ లో సెంచరీ పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ హమ్మయ్యా అని ఊపిరీపీల్చుకున్నట్లు 100 హత్యలు చేసిన ఓ డాక్టర్ ఇక చాలులే నిలిపేద్దాం అనుకున్నాడు. వైద్యులకే మచ్చ తెచ్చిన ఆ డాక్టర్ ఒక్కొక్క విషయం బయటకు వస్తుండటంతో పోలీసు అధికారులతో పాటు సాటి వైద్యులు, ప్రజలు షాక్ కు గురైనారు. నకిలీ గ్యాస్ ఏజెన్సీలు, కిడ్నీ రాకెట్, చోరీ చేసిన వాహనాలు విక్రయాలు ఇలా దందాలు చేసిన ఆ డాక్టర్ 100 మందిని అతి కిరాతకంగా హత్య చేసి ఆ శవాలను తీసుకెళ్లి నదీ కెనాల్ లో పడేసి మొసళ్లకు ఆహారంగా వేసి ఎలాంటి ఆధారాలు చిక్కకుండా చేశాడని వెలుగు చూసింది. శవాలు మొత్తం మెసళ్లకు బిర్యానీ పెట్టినట్లు పెట్టేశాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని డాక్టర్ అంటున్నాడు. హాలీవుడ్ సినిమాలను తలతన్నే థ్రిల్లర్ క్రైమ్ స్టోరీని ఈ డాక్టర్ రక్తచరిత్ర ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

  తెలుగు రాష్ట్రాల్లో లో ఘనంగా నాగుల చవితి వేడుకలు| Telugu States Celebrating Nagula Chavithi Festival

  Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

  జస్ట్ 100 హత్యలు అంతే !

  జస్ట్ 100 హత్యలు అంతే !

  దేవేంద్ర కుమార్ శర్మ (61) బీఏఎంఎస్ డిగ్రీ (ఆయుర్వేదం) మాత్రమే చదివాడు. 26 ఏళ్ల వయసులో 1984లో దేవేంద్ర కుమార్ శర్మ డాక్టర్ గా అవతారం ఎత్తి రాజస్థాన్ లోని దౌసాలో ఓ క్లీనిక్ ప్రారంభించాడు. అయితే అతను కిడ్నీ మార్పిడి రాకెట్ ను నిర్వహించాడు. డబ్బులు బాగా సంపాధించాలనే ఉద్దేశంతో తనపని పూర్తి కావాలనే అతను చాలా అడ్డదార్లు తొక్కాడు. తనపని పూర్తి కావడానికి డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో 100 మందిని హత్య చేశాడు. అయితే డాక్టర 100 మందిని పైగానే చంపేసి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

   పేరుకే డాక్టర్.... పక్కా క్రిమినల్

  పేరుకే డాక్టర్.... పక్కా క్రిమినల్

  డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ పేరుకు మాత్రమే పైకి డాక్టర్ గా చలామణి అయ్యాడు. అయితే అతని పనులు అన్ని పక్కా క్రిమినల్ పనులే. కిడ్నీ రాకెట్ దందాతో పాటు చోరీ చేసిన వందల వాహనాలను తప్పుడు పత్రాలు సృష్టించి అమాయకులకు విక్రయించాడు. నకిలీ గ్యాస్ ఏజెన్సీలను తెరమీదకు తీసుకు వచ్చి గ్యాస్ సిలిండర్లు తీసుకెలుతున్న లారీలను అడ్డగించి ఆ ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హత్య చేసి గ్యాస్ సిలిండర్లు, ఆ ట్రక్కులను ఎత్తుకెళ్లాడు.

  పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి

  పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి

  100 మందిని అతి కిరాతకంగా హత్య చేసిన డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే 2020 జనవరి నెలలో పెరోల్ మీద బయటకు వచ్చిన డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ పోలీసులకు చిక్కకుండా మాయం అయ్యాడు. సీరియల్ కిల్లర్, నరహంతకుడు డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ ఢిల్లీలో కొంతకాలం తలదాచుకుని అక్కడి నుంచి బాప్రోలాకు వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న ఓ వితంతువును వివాహం చేసుకుని అక్కడే రహస్యంగా కాపురం పెట్టి జల్సా చేశాడు.

  ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీతో సీన్ రివర్స్

  ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీతో సీన్ రివర్స్


  సీరియల్ కిల్లర్ డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ మాయం కావడంతో అతని కోసం రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్స్ సెల్ పోలీసులు అతని కోసం రంగంలోకి దిగారు. ఢిల్లీలోని బాప్ రైలాలోని ఓ ఇంటిలో డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ తలదాచుకున్నాడని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని అరెస్టు చేశారు.

  బిర్యానీ తిన్నట్లు మొసళ్లు తినేశాయి

  బిర్యానీ తిన్నట్లు మొసళ్లు తినేశాయి


  100 మందిని చంపిన డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ ఆ శవాలను ఏం చేశాడు ? అని పోలీసు అధికారులు ఆరా తీసి షాక్ కు గురైనారు. తాను వరుసగా చంపేసిన వారి శవాలను తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్ లోని కస్గంజ్ కెనాల్ కాలువలో విసిరేశానని, నదికాలవలో వందల సంఖ్యలో ఉన్న మొసళ్లు ఆ శవాలను తినేసి ఉంటాయని, ఇప్పుడు మీరే ఏం చేస్తారు ? అంటూ డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ తాఫీగా సమాధానం చెప్పడంతో పోలీసు అధికారులు షాక్ కు గురైనారు.

  భార్య, ముగ్గురు పిల్లలకోసం

  భార్య, ముగ్గురు పిల్లలకోసం


  డాక్టర్ జీవితం ప్రారంభించిన దేవేంద్ర శర్మ 10 సంవత్సరాలు అందరిలో గౌరవంగా బతికాడు. గ్యాస్ ఏజెన్సీ కోసం ప్రజల నుంచి రూ. 11 లక్షలు సేకరించి డీలర్ షిప్ తీసుకోవాలని చేతులు కాల్చుకున్నాడు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న దేవేంద్ర కుమార్ శర్మ భార్య, ముగ్గురు కుమారులను పోషించడానికి తరువాత అడ్డదార్లు తొక్కాడు. డబ్బులు ఇచ్చిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆలీఘర్ లోని చారాలోని సొంత గ్రామం చెక్కేసిన దేవేంద్ర కుమార్ శర్మ తరువాత గ్యాస్ ఏజెన్సీ కోసం ఆలీఘర్- లక్నోల మద్య ప్రయాణం చేస్తున్న సమయంలో దలాల్ పూర్ గ్రామానికి చెందిన రాజ్, వేద్వీర్, ఉదయూర్ తదితరుల పరిచయాలు పెరగడంతో పక్కా క్రిమినల్ గా మారిపోయాడని పోలీసు అధికారులు అంటున్నారు.

  English summary
  New Delhi: Murderer doctor’s 100 victims became crocodiles feed in Uttar Pradesh canal. He would perhaps have gone through life as a genteel Dr Jekyll, but a failed business investment turned ayurvedic practitioner Devender Sharma into a monstrous Mr Hyde. His journey in notoriety included a kidney transplant racket, the operation of a fake gas agency and the sale of stolen vehicles.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X