వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

sero survey: ఈ వయస్సు వారిపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువే.. జర జాగ్రత్త సుమీ, హెచ్చరికలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో సీరం సర్వే చేపట్టగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. వైరస్ ప్రభావం పిల్లలు, వృద్దులపై ఎక్కువగా ఉంటోంది. అయితే 5 నుంచి 17 ఏళ్ల లోపు వయసు గల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దీంతో ఆ వయస్సు గల వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే కరోనా వైరస్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి..

రెండోసారి చేసిన సర్వేలో వెల్లడి

రెండోసారి చేసిన సర్వేలో వెల్లడి

ఇటీవల ఢిల్లీలో సీరం సర్వే చేపట్టింది. ఆగస్టు ఒక‌టో తేదీ నుంచి 7వ తేదీ మధ్య రెండోసారి సర్వే చేసింది. ఢిల్లీ జనాభాలో 29.1 శాతం మందిలో సార్స్‌-కోవ్‌-2తో పోరాడే ప్రతిరోధకాల అభివృద్ధి జ‌రిగిందని గుర్తించారు. సర్వేలో 15 వేల మంది పాల్గొనగా.. వారిలో 25 శాతం మంది 18 ఏళ్లలోపు వారు ఉన్నారు. 50 శాతం మంది 18 నుంచి 50 ఏళ్లలోపు వారు ఉండగా.. మిగిలిన వారు 50 ఏళ్లు పైబడిన వారున్నారు.

వీరికి ప్రభావం ఎక్కువ...

వీరికి ప్రభావం ఎక్కువ...

ఐదు నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 34.7 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని సర్వే ఫలితాలు స్పష్టంచేశాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో 31.2 శాతం మంది కరోనా బారి నుంచి కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలోని 28.5 శాతం మందిలో వైరస్‌తో పోరాడే ప్రతిరోధకాలు అభివృద్ధి చెందాయని స‌ర్వేలో తేలింది.

Recommended Video

Beirut Effect,740 Tonnes of Ammonium Nitrate Shifted From Chennai To Hyderabad || Oneindia Telugu
వీరు 61.31 శాతం మంది

వీరు 61.31 శాతం మంది

ఇండియన్ మెడికల్ రీసెర్చ్ లెక్కల ప్రకారం 21 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారిలో 61.31 శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారని తేలింది. మరోవైపు కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి. డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఆక్స్ ఫర్డ్ కోవిషిల్డ్, చైనా, రష్యా.. భారత్‌కు చెందిన మూడు వ్యాక్సిన్ల తయారీ తుది దశలో ఉన్నాయి. కానీ కొన్నిచోట్ల ఎలాంటి లక్షణాలు లేకుండా.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లేకుండా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

English summary
sero survey: 5 to 17 years youngers most effect coronavirus sero survey revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X