వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్ వల్ల వలంటీర్‌కు నరాల బలహీనతా?: సీరమ్ ఏం చెబుతోంది: రూ.100 కోట్ల పరువు నష్టం

|
Google Oneindia TeluguNews

పుణె: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఇంకో మూడు నెలల్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితుల్లో.. సరికొత్తగా వివాాదాలు ముసురుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్న ఓ వలంటీర్ చేసిన తాజా ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. వ్యాక్సిన్‌ను వేయించుకున్న తనకు నరాల బలహీనత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. న్యూరో సిస్టమ్ డ్యామేజ్ అయినట్లు చెబుతున్నారు. దీనికి పరిహారంగా తనకు అయిదు కోట్ల రూపాయలను చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ అది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది సీరమ్ ఇన్‌స్టిట్యూట్. క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రాష్ట్రాల్లో వలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఓ వలంటీర్.. లేవనెత్తిన అనారోగ్య కారణాలు చర్చనీయాంశమౌతున్నాయి. వ్యాక్సిన్ అనంతరం తన నరాల వ్యవస్థ దెబ్బతిన్నదని, సైకలాజికల్‌గా బాధపడుతున్నట్లు ఆరోపిస్తున్నాయి. తనకు అయిదు కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలంటూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు నోటీసులను పంపించారు.

Serum files Rs 100 crore defamation suit against man claiming neuro damage after vaccine trial

ఈ ఆరోపణలను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆ వలంటీర్ చేస్తోన్న ఆరోపణలు వాస్తవం కాదని నిర్ధారించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావనే నిర్ధారించుకున్న తరువాతే క్లినికల్ ట్రయల్స్ చేపట్టామని వెల్లడించింది. తప్పుడు ఆరోపణలను చేసిన ఆ వలంటీర్‌పై పరువునష్టం దావా వేయడానికి సిద్ధపడుతోంది. 100 కోట్ల రూపాయల మేర పరువు నష్టం దావాను వేయబోతోన్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Recommended Video

PM Modi visits Bharat Biotech | PM Modi In PPE kit, Reviews COVID vaccine development

అతను తమకు పంపించిన పరిహారం చెల్లింపు నోటీసులోని అంశాలు క్లినికల్ ట్రయల్స్‌ను పక్కదారి పట్టించేలా ఉన్నాయని సీరమ్ పేర్కొంది. వ్యాక్సిన్‌ ప్రయోగానికి, వాలంటీర్‌ ఆరోగ్య సమస్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తన వ్యక్తిగత ఆనారోగ్య సమస్యలకు వ్యాక్సిన్‌ ప్రయోగాలే కారణమనడంలో అర్థం లేదని, దీని వెనుక అయిదు కోట్ల రూపాయలను సంపాదించాలనే దురుద్దేశంతో కనిపిస్తోందని తెలిపింది. అకారణంగా తప్పుడు ఆరోపణలను చేసిన ఆ వలంటీర్‌పై 100 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేసింది

English summary
Serum Institute has filed a Rs 100 crore defamation suit against a Chennai-based volunteer who took part in the coronavirus vaccine 'Covishield' trial and later claimed to suffer from neurological and psychological issues as a result of taking the dose.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X