• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీరంలో ఘోరం: ఐదుగురి ఆహుతి -పుణెలోని వ్యాక్సిన్ తయారీ కేంద్రం ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం

|

మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఫార్మా దిగ్గజం 'సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)' వ్యాక్సిన్ సెంటర్ ప్రాంగణంలో గురువారం చోటుచేసుకున్న భారీ అగ్నప్రమాదంలో నష్టం అనుకున్నదానికంటే ఎక్కువగానే తేలుతోంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలైనట్లు గుర్తించారు. ఇంకా ఎంతమంది చిక్కుకుపోయారు, నష్టతీవ్రత వివరాలు తెలియాల్సి ఉంది.

ఏపీ సీఎంగా అంజాద్‌బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొర

పూణెలోని మంజరీ ప్రాంతంలో ఉన్న సీరమ్ ఫార్మా ప్రాంగణంలోని నిర్మాణ దశలో ఉన్న సెజ్‌3 భవనంలోని నాలుగు, ఐదు అంతస్తుల్లో గురువారం జరిగిన అగ్నప్రమాదం వివరాలను పుణె మేయర్ మురళీధర్ మోహుల్ మీడియాకు వివరించారు. బాగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను అగ్నిమాపక శాఖ రెస్క్యూ సిబ్బంది వెలికితీశారని చెప్పారు. అయితే..

Serum Institute Fire Updates: At Least 5 Dead, Covishield facility unaffected

భవనంలో ఎందుకు మంటలు చెలరేగాయన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదని, జరుగుతున్న వెల్డింగ్ పనుల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తాము ఊహిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ లేదని సంస్థ ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది.ఘటన జరిగిన ప్రాంతాన్ని 'మంజరీ' అని పిలుస్తారు. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే ప్రదేశం నుంచి కాస్త దూరంలో ఉంటుందని సీరం సీఈవో అధర్ పూనావాల తెలిపారు. కాగా..

జగన్ క్రేజ్ బాగా తగ్గింది -చంద్రబాబు ఇంకా కిందికి -వైసీపీ, టీడీపీల విరాళాల్లో తగ్గుదల: ఈసీ రిపోర్ట్

భారత్ సహా 100కుపైగా పేద దేశాలకు తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో సీరం సంస్థ.. కొవిషీల్డ్ అదనపు ఉత్పత్తి కోసం కొత్తగా మరొకొన్ని భవంతులను నిర్మిస్తున్నది. దాదాపు పూర్తికావచ్చిన ఆ నిర్మాణాల్లోనే ఇవాళ అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.

  Three dead in a road accident on Hyderabad ORR | Oneindia Telugu

  Serum Institute Fire Updates: At Least 5 Dead, Covishield facility unaffected

  English summary
  Five people were killed as a massive fire fire broke out at an under-construction building at the Serum Institute of India's Manjari premises in Pune. Pune's Mayor Murlidhar Mohol said the five whose charred bodies were found were perhaps construction workers. The cause of the fire is yet to be ascertained but it is being speculated that welding work caused the fire, he said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X