వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్‌పై గుడ్‌న్యూస్: డీసీజీఐ గ్రీన్ సిగ్నల్: ఆక్స్‌ఫర్డ్-సీరమ్ ట్రయల్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వ్యాక్సిన్ చెలరేగిపోతోంది. వీర విజృంభణ కొనసాగిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రోజువారీ కరోనా కేసులు 50 లక్షల వరకు నమోదు అయ్యాయి. 80 మంది వేల మందికి కరోనా కాటుకు బలి అయ్యారు. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మినహా మరో దారి లేదు. ఆక్స్‌ఫర్డ్ తయారు చేస్తోన్న వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతోన్న దశలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావంతో దాన్ని నిలిపి వేశారు.

మధ్యవర్తిత్వంలో ట్రంప్ ఘటికుడే: దశాబ్దాల శతృత్వానికి తెర: మూడు దేశాల మధ్య అబ్రహం అకార్డ్స్మధ్యవర్తిత్వంలో ట్రంప్ ఘటికుడే: దశాబ్దాల శతృత్వానికి తెర: మూడు దేశాల మధ్య అబ్రహం అకార్డ్స్

దాని ప్రభావం భారత్‌లోనూ పడింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తన క్లినికల్ ప్రయోగాలను నిలిపివేసింది. తాజాగా- వాటిని పునరుద్ధరించబోతున్నారు. ఈ మేరకు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను పునఃప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు డీసీజీఐ చీఫ్ డాక్టర్ వీజీ సోమాని ఆదేశాలు జారీ చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నిపుణులు తమ ప్రయోగాలను ఇటీవలే పునరుద్ధరించారు.

Serum Institute Gets DCGI permission To Resume Oxford COVID-19 Vaccine Trial In India

కరోనా వ్యాక్సిన్‌పై రెండు, మూడు దశల్లో ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నారు. దానికి అనుగుణంగా భారత్‌లోనూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ తన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను తిరిగి చేపట్టడానికి డీసీజీఐ చీఫ్ అనుమతి ఇచ్చారు. ప్రయోగాలను నిలిపివేయడానికి ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినందున.. మరిన్ని ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్ అందజేసిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుందని డీసీజీఐ సూచించింది. వారి ఆరోగ్య స్థితిగతులపై ఎలాంటి అదనపు సమాచారాన్ని అడిగినా అందజేయాల్సి ఉంటుందని, సైడ్ ఎఫెక్ట్స్‌ను గుర్తించడానికి వీలుగా 24 గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలనీ పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే.

భారత్ తరఫున సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇందులో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రాజెనెకా-సీరమ్ ఇన్‌స్టిట్యూట్ మధ్య ఈ మేరుకు ఒప్పందాలు కుదిరాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా బ్రిటన్‌లో తమ క్లినికల్ ట్రయల్స్‌ను పునరుద్ధరించాయి. భారత్‌లోనూ ట్రయల్స్‌ పునరుద్ధరించడానికి అవసరమైన డేటాను డీసీజీఐకి అందింంచాయి. యూకేలోని డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డు సైతం దీనికి అవసరమైన సమాచారాన్ని డీసీజీఐకి అందజేసింది. దీనితో ట్రయల్స్‌ను పునరుద్ధరించడానికి అనుమతి ఇచ్చింది.

English summary
Drugs Controller General of India (DCGI) Dr V G Somani on Tuesday gave permission to Serum Institute of India to resume clinical trial of the Oxford COVID-19 vaccine candidate in the country while revoking its earlier order of suspending any new recruitment for phase two and three trial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X