వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీరమ్‌తో జట్టుకట్టిన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్: భారత్‌లో అదనంగా ఆ డోసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు పడింది. భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అదనంగా మరో 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయబోతోంది. దీనికోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో జట్టుకట్టింది. గవి వ్యాక్సిన్ అలయెన్స్‌ కూడా సీరమ్‌, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో చేతులు కలిపాయి.

భారత్ సహా.. ఆర్థికంగా వెనుకబడిన, అభివృద్ధి చెందని దేశాల ప్రజల కోసం ఈ అదనపు 100 మిలియన్ డోసుల కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆయా దేశాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌ను పేద, అభివృద్ధి చెందని దేశాలకు సరఫరా చేేసే బాధ్యతను బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ తీసుకుంటుందని ప్రాథమికంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఈ అదనపు డోసుల వ్యాక్సిన్‌ను పేద దేశాలకు సరఫరా చేస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.

Serum Institute of India collaborate wih Gavi, Vaccine Alliance and Bill and Melinda Gates Foundation

ఇదివరకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కుదుర్చుకున్న ఒప్పందాలతో పోల్చి చూసుకుంటే.. ఆ సంస్థ మొత్తం 200 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారీ కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థలతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. రెండు, మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ వ్యాక్సిన్ వల్ల ప్రతికూల ఫలితాలు వస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి.

Recommended Video

SP Charan Clarity On SP Balasubrahmanyam Hospital Bill | Oneindia Telugu

క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న సమయంలో పేషెంట్లలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు తేలడంతో ఆస్ట్రాజెనెకా సంస్థ తాత్కాలికంగా వాటిని నిలిపివేసింది. దాని ప్రభావం వల్ల భారత్‌లోనూ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. అనంతరం మళ్లీ అనుమతులు లభించడంతో క్లినికల్ ట్రయల్స్ పట్టాలెక్కాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రయోగాలను పూర్తి చేయాలని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి.

English summary
Serum Institute of India (SII) to produce up to an additional 100 million COVID19 vaccine doses for India and low and middle income countries in 2021. Announcement takes forward the collaboration between SII, Gavi, Vaccine Alliance and Bill and Melinda Gates Foundation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X