వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కోసం మరో కొత్త వ్యాక్సిన్..సీడీఎక్స్-005: సీరమ్ తయారీ: ముక్కు ద్వారా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. టాప్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను డెవలప్ చేస్తున్నాయి. ఏడెనిమిది వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నాయి. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వాటితో జత కట్టింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కరోనా సైతం కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అవన్నీ ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్నాయి.

షారుఖ్ ఖాన్ టీమ్‌కు మాత్రమే: స్పెషల్ ట్రీట్‌మెంట్: బుర్జ్ ఖలీఫాపై కేకేఆర్‌కు గ్రాండ్ వెల్‌కమ్షారుఖ్ ఖాన్ టీమ్‌కు మాత్రమే: స్పెషల్ ట్రీట్‌మెంట్: బుర్జ్ ఖలీఫాపై కేకేఆర్‌కు గ్రాండ్ వెల్‌కమ్

తాజాగా- అమెరికాకు చెందిన టాప్ ఫార్మా కంపెనీ కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న కొడాజెనిక్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్.. కొత్తగా కరోనా వ్యాక్సిన్‌ను డెవలప్ చేసింది. ఆ వ్యాక్సిన్ పేరు సీడీఎక్స్-005. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసే బాధ్యతలను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తీసుకుంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. సీడీఎక్స్-500 వ్యాక్సిన్ తయారీని ఆరంభించింది కూడా. ఈ వ్యాక్సిన్‌పై ఈ ఏడాది చివరి నాటికి ట్రయల్స్ చేపట్టడానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Serum Institute of India starts manufacturing Codagenix vaccine for COVID-19

ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న వ్యాక్సిన్లన్నీ ఇంజెక్షన్ల రూపంలో పేషెంట్లకు ఇవ్వదగ్గవి. దీనికి భిన్నంగా కొడాజెనిక్స్.. సీడీఎక్స్-005 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇన్‌హేలర్ తరహాలో నాశికం ద్వారా తీసుకోదగ్గ వ్యాక్సిన్ ఇది. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు కొడాజెనిక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాబర్ట్ కోల్మన్ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి బ్రిటన్‌లో తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ప్రీ-క్లినికల్ ట్రయల్స్ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇచ్చాయని, దానితో ఈ ఏడాది చివరి నాటికి ప్రయోగాలు చేపట్టబోతున్నామని అన్నారు. మిగిలిన వ్యాక్సిన్ల కంటే భిన్నంగా వినియోగించేలా దీన్ని రూపొందించామని పేర్కొన్నారు.

Recommended Video

IPL 2020: Hyderabad Fans Response | Oneindia Telugu

English summary
Serum Institute of India (SII) has started manufacturing COVID-19 vaccine candidate developed by Codagenix Inc, the US biotech firm said in a statement. The pre-clinical study of Codagenix's COVID-19 vaccine has showed promising results, the vaccine maker claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X