వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రో రైలుకూ అడ్డం పడ్డ ప్రబుద్ధుడు: తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సాధార‌ణ రైళ్ల‌కే అనుకుంటే.. మెట్రో రైలుకు కూడా అడ్డం ప‌డ్డాడో ప్రబుద్ధుడు. కాక‌పోతే- తృటిలో ప్రాణాల‌తో బ‌య‌టప‌డ గ‌లిగాడు. మెట్రో స్టేష‌న్ సిబ్బంది చురుగ్గా వ్య‌వ‌హ‌రించి, అత‌ణ్ని రైలు కింద ప‌డ‌కుండా ప‌క్కకు లాగేశారు. దేశ రాజ‌ధానిలోని య‌మునా బ్యాంక్‌-వైశాలి సెక్ష‌న్ ప‌రిధిలో బుధ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఫ‌లితంగా- బ్లూ లైన్ మార్గంలో మెట్రో రైళ్ల రాక‌పోక‌ల్లో తీవ్ర జాప్యం ఏర్ప‌డింది. బ్లూ లైన్ మార్గంలో రైళ్లు ఆలస్యంగా న‌డుస్తున్నాయ‌ని అంటూ ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేష‌న్ వెల్ల‌డించింది.

<strong> రైతాంగానికి చేదు వార్త‌: వారం ఆల‌స్యంగా నైరుతి! </strong> రైతాంగానికి చేదు వార్త‌: వారం ఆల‌స్యంగా నైరుతి!

ఢిల్లీ న‌గ‌ర శివార్ల‌కు ఆనుకుని ఉండే ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్ కౌశంబి స్టేష‌న్‌లో ఈ ఉద‌యం 9:50 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్నట్లు డీఎంఆర్‌సీ పేర్కొంది. ఈ ఉద‌యం కౌశంబి స్టేష‌న్‌కు వ‌చ్చిన గుర్తు తెలియ‌ని యువ‌కుడొక‌డు.. రైలు బ‌య‌లుదేరే స‌మ‌యానికి అందులో నుంచి ప‌ట్టాల పైకి దూకేశాడు. ద్వార‌కా వైపున‌కు బ‌య‌లుదేర‌డానికి క‌దిలిన స‌మ‌యంలో అనూహ్యంగా ఆ యువ‌కుడు ప‌ట్టాల‌పైకి దూకాడు.

Services delayed on section of Blue Line after man jumps on tracks

మ‌హిళ‌ల కోసం కేటాయించిన ర్యాక్, దాని వెనుక ర్యాక్ మ‌ధ్య స్థ‌లంలో ఇరుక్కుపోయాడు. అత‌ణ్ని గుర్తించిన వెంట‌నే- స్టేష‌న్ సిబ్బంది రైలును ఆపేశారు. ర్యాక్ ల మ‌ధ్య ఇరుక్కున్న అత‌ణ్ని అతి క‌ష్టం మీద బ‌య‌టికి లాగారు. ఆ వెంటనే పోలీసులు అత‌ణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న వ‌ల్ల బ్లూ లైన్ మార్గంలో రైళ్ల రాక‌పోక‌లు జాప్యం ఏర్ప‌డిన‌ట్లు డీఎంఆర్‌సీ వెల్ల‌డించింది.

English summary
Services were briefly delayed on a section of Delhi Metro's Blue Line after a man allegedly jumped on tracks at Kaushambi station on Wednesday, officials said. Kaushambi station falls in Ghaziabad on the Yamuna Bank-Vaishali branch section of the Blue Line. "From 9.56 to 10.03 am, metro services were slightly affected on Line-3/4 (Blue Line) due to a male passenger who allegedly jumped on tracks at Kaushambi station, when a train, going towards Dwarka, was approaching a platform," a DMRC official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X