వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులో చుక్కెదురు: చిదంబరం బెయిల్ పిటిషన్ తిరస్కరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. అరెస్ట్ అయిన తర్వాత ఈ పిటిషన్ నిష్ఫలమని పేర్కొంది.

ముందస్తు బెయిల్ కావాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను గత బుధవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జరిగిన అవకతవకలకు చిదంబరమే ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోందని హైకోర్టు పేర్కొంది. దీంతో సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు.

 Setback For P Chidambaram, Top Court Says His Petition Infructuous

అనాటి నుంచి చిదంబరంకు వరుసగా ఇలా చుక్కెదురవుతుండటం గమనార్హం. ఆ తర్వాత చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. కాగా, నేటితో సీబీఐకి చిదంబరంను కస్టడీకి ఇచ్చిన గడువు ముగిసింది.

ఇది ఇలావుంటే.. చిదంబరం అరెస్ట్ తర్వాత సుప్రీంకోర్టులో చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ లిస్ట్‌కు రాలేదు. ఆ తర్వాత అవసరమైన చర్యలు రిజిస్ట్రీ తీసుకుంటారని న్యాయమూర్తి ఒకరు తెలిపారు.

ఇది ఇలావుంటే.. చిదంబరం అరెస్ట్ తర్వాత సుప్రీంకోర్టులో చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ లిస్ట్‌కు రాలేదు. ఆ తర్వాత అవసరమైన చర్యలు రిజిస్ట్రీ తీసుకుంటారని న్యాయమూర్తి ఒకరు తెలిపారు.

English summary
Former Finance Minister P Chidambaram, arrested on Wednesday in a corruption investigation, began the day with a series of setbacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X