వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘోర రోడ్డు ప్రమాదం... ట్రక్కును ఢీకొట్టిన బస్సు... ఏడుగురు మృతి...
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున రాయ్‌పూర్‌లోని చెరీ ఖేడీ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
మృతులంతా వలస కార్మికులేనని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఆ బస్సు ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వలస కార్మికులను తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాయ్‌పూర్ ఎస్ఎస్‌పీ అజయ్ యాదవ్ మాట్లాడుతూ... ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా,మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.

Floods: ప్రమాదకరస్థాయిలో రామప్ప చెరువు,కోనా రెడ్డి చెరువు కు గండి ! పోటెత్తుతున్న వరద నీరు...!!
బస్సును ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.