వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9th విద్యార్థులపై లైంగిక వేధింపులు... 7గురు ప్రభుత్వ టీచర్స్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఒకే స్కూలుకు చెందిన ఏడుగుగు ఉపాధ్యాయులు, విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు అరోపణలు ఎదుర్కోన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విద్యార్థులను టూరుకు తీసుకువెళ్లి ఓ విద్యార్థిపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో విచారణ జరపగా మొత్తం స్కూళ్లోని ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అసలు బండారం బయటపడింది.

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బాలోదబజార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది, తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలపై ఓ టీచర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే...జిల్లాలోని క్యాస్డోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవెంద్ర కుంతే, రామేశ్వర్ ప్రసాద్ సాహూ, రూప్ నారాయణ్‌ సాహూ, మహెశ్ కుమార్ వర్మ, దినేష్ కుమార్ సాహూ, చాదన్ దాస్, మరియు లాల్‌‌రాం అనే ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.

seven government school teachers were arrested for allegedly molesting

అయితే గత జనవరి 2018లో దేవెంద్ర కుంతే అనే ఉపాధ్యాయుడు పిల్లల్ని పిక్‌నిక్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ తోమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

ఇక రామేశ్వర్ ప్రసాద్ అనే ఉపాధ్యాయుడు ఓ విద్యార్ధినికి ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. కాగా మిగతా అయిదుగురు ఉపాధ్యాయులు కూడ బాలికలతో అసభ్యంగా వ్యవహరించారని చెప్పారు. అయితే బాధిత విద్యార్థినిలు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించినట్టు చెప్పారు. అయితే ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో ఇటివల జరిగిన పేరేంట్ కమిటీ సమావేశంలో వారు ఈ విషయాన్ని లేవనెత్తారు. స్కూల్ ప్రిన్సిపల్‌కు వేధింపులపై ఫిర్యాదులు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

English summary
seven government school teachers were arrested for allegedly molesting two Class 9 students in Chhattisgarh's Balodabazar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X