వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోల మెరుపు దాడిలో ఏడుగురు జవాన్ల మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Seven police personnel killed in Maoist attack
రాయపూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మావోయిస్టులు జవాన్లపై మెరుపు దాడి చేశారు. శుక్రవారం జరిగిన ఈ మావోయిస్టుల ఏడుగురు జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన గువాకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్‌గిరిలో జరిగింది. పోలీసులు వ్యాన్‌లో వెళ్తుండగా పేల్చివేశారు.

బంగారం పట్టివేత

రెండున్నర కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్ నుంచి 2.5 కిలోల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు వీరిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

నేతలపై ఎఎపి

రాజకీయ పార్టీల నేతలందర్నీ రిలయన్స్ గుప్పిట్లో పెట్టుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ఆరోపించింది. హైదరాబాదులో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ.. కెజి బేసిన్ ధరలపై రిలయన్స్ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతోందని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలపై 4 వేల కోట్ల రూపాయల భారం పడే గ్యాస్ ధరల పెంపు ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కెజి బేసిన్ గ్యాసుపై ఇతర పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదని? అన్ని పార్టీలు ముఖేష్ అంబానీకి అమ్ముడు పోయాయా? అంటూ నిలదీశారు.

English summary

 Six police personnel killed in Maoist attack in Dantewada, Chhattisgarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X