• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆడుకుంటున్న చిన్నారి పిలిస్తే రాలేదని... కొట్టి చంపిన తండ్రి...!

|

భార్యభర్తలు మధ్య గోడవ జరుగుతుంటే అడ్డు వెళ్లిన ఏడేళ్ల చిన్నారి బలయింది. తల్లిని చితకబాదుతున్న వద్దూ అంటూ.. మధ్యలో వెళ్లడంతో తల్లీ మీద కోపం, కన్న కూతురుపైనే చూపించాడు మద్యం మత్తులో ఉన్న ఓ కిరాతక తండ్రి,ఘర్షణ మధ్యలో వెళ్లిన కూతురును కూడ తీవ్రంగా గాయపరిచిన తండ్రి బాలికను పైకి లేపి క్రింద నేలకు కొట్టాడు. దీంతో సృహ కోల్పోయిన చిన్నారి అనంతరం చికిత్సపోందుతూ మృతి చెందింది.

కూతురు తన మాట వినలేదని కోపంతో...

కూతురు తన మాట వినలేదని కోపంతో...

సభ్య సమాజం తల వంచుకునే హృదయ విదారకరమైన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువనేలి జిల్లాలో జరిగింది. జిల్లాలోని రెండవ తరగతి చదువుతున్న ఏడేళ్ల సుగిర్త అనే చిన్నారీ తోటి స్నేహితులతో ఆడుకుంటుండా తండ్రి కైలాష్ కూతురును ఇంట్లోకి రమ్మని పిలిచాడు. అయితే పిల్లలతో ఆటలోమునిగిపోయిన సుగిర్త తండ్రి మాట వినిపించుకోలేదు. దీంతో సాయంత్రం వరకు పిల్లలతో ఆడుకుంటూ బయటే ఉండిపోయింది..

మద్యం మత్తులో ఉన్న తండ్రికి అడ్డు వెళ్లినందుకు

మద్యం మత్తులో ఉన్న తండ్రికి అడ్డు వెళ్లినందుకు

అయితే ఇంటినుండి బయటకు పోయిన తండ్రి కాసేపటి తర్వాత మద్యం మత్తులో తిరిగి ఇంటికి వచ్చాడు. అనంతరం తన భార్య అయిన నీలవతిని అకారణంగా కొట్టడం ప్రారంభించాడు. తాను పిలిచినప్పుడు కూతురు రాకపోవడానికి కారణం నువ్వే అంటు భార్యను చితకబాదాడు. దీంతో తండ్రిని అడ్డుకునేందుకు సుగిర్త మధ్యలో వెళ్లింది. ఇక అప్పటికే కూతురుపై కోపంగా ఉన్న కైలాష్, మరింత కోపానికి గురయ్యాడు. మధ్యలో వచ్చిన కూతురును సైతం గాయాల పాలు చేశాడు.అనంతరం చిన్నారిని పైకెత్తి నేలకు కోట్టాడు.

దెబ్బలకు తాళలేని చిన్నారీ మృతి...

దెబ్బలకు తాళలేని చిన్నారీ మృతి...

తండ్రి దెబ్బలకు తాళలేని చిన్నారి సుగిర్తా ఇంట్లోనే సృహ తప్పిపోయింది. దీంతో బాలికను ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పోందుతూ మృత్యువాత పడింది. ఇంత జరిగినా పోలీసులకు తెలియకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డారు. తమ కూతురు అనారోగ్యంతో బిల్డింగ్ పై నుండి పడిపోయిందని ప్రచారం చేశారు. ఇందుకోసం తల్లీ నీలవతీ సైతం తాగుబోతు తండ్రికి వత్తాసు పలికింది..అనంతరం చిన్నారీని ఖననం చేసేందుకు సిద్దమయ్యారు. అయితే బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు, చుట్టుపక్కల వారు పోలీసులకు పిర్యాధు చేశారు.

తల్లిదండ్రుల అరెస్ట్...

తల్లిదండ్రుల అరెస్ట్...

బంధువుల పిర్యాధుతో అరగెట్రం చేసిన పోలీసులు బాలిక శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరిలించారు. విచారణలో భాగంగా పోలీసులు అసలు సమాచారం రాబట్టారు. అనంతరం బాలిక చావుకు కారణమైన తండ్రిని, అందుకు సహకరించిన తల్లిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
seven-year-old girl was beaten to death by her alcoholic father as she intervened in a fight between her parents and tried stopping him from thrashing her mother.Police have arrested 37-year-old S Kailash, a resident of Tirunelveli district in Tamil Nadu, and his wife Neelavathi, 32, who allegedly tried to cover up the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more